మాస్ మహారాజ్ రవితేజ(Raviteja) బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా వరుస ఫ్లాఫ్స్ లో ఉన్న టైం లో ధమాకా(Dhamaka) సినిమా తో సాలిడ్ కంబ్యాక్ ని సొంతం చేసుకుని కెరీర్ బెస్ట్ హిట్ ని దక్కించుకుని సత్తా చాటిన విషయం తెలిసిందే. ఈ సినిమా మాదిరిగానే ఇది వరకు రవితేజ వరుస ఫ్లాఫ్స్ లో ఉన్న టైం లో ఒక సాలిడ్ కంబ్యాక్ అవసరం అయినప్పుడు అదిరిపోయే కంబ్యాక్ ని దక్కించుకున్నాడు.
ఆ సినిమానే బలుపు… 2013 లో వచ్చిన ఈ సినిమా తోనే రవితేజ అప్పటికి కెరీర్ లో బిగ్గెస్ట్ కంబ్యాక్ ని సొంతం చేసుకోగా బాక్స్ ఆఫీస్ దగ్గర కంబ్యాక్ తో కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ ని కూడా సాధించాడు. అంతకన్నా ముందు బాక్స్ ఆఫీస్ దగ్గర మిరకపకాయ్ తో…
సూపర్ హిట్ ని సొంతం చేసుకున్న రవితేజ తర్వాత దొంగలముట, వీర, నిప్పు, దరువు, దేవుడు చేసిన మనుషులు మరియు సారొచ్చారు అంటూ బాక్ టు బాక్ 7 సినిమాలు ఫ్లాఫ్స్ ను సొంతం చేసుకున్నాడు, దరువు పర్వాలేదు అనిపించినా కలెక్షన్స్ ఆశించిన మేర రాలేదు… మొత్తం మీద 7 బాక్ టు బాక్ ఫ్లాఫ్స్ తర్వాత…
రవితేజ కి డాన్ శీను తో హిట్ ఇచ్చిన గోపీచంద్ మలినేని తో కలిసి చేసిన బలుపు(Balupu) సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రొటీన్ మాస్ స్టఫ్ తోనే వచ్చినా టేకింగ్ బాగుండటం రవితేజ రోల్ అడిరిపోవడం తో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసింది. సాలిడ్ కలెక్షన్స్ ని సాధించి దుమ్ము లేపి రవితేజ కెరీర్ లో హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమాగా నిలిచింది.
ఈ సినిమా కి ఆ టైం లో 14.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా డబుల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని 29 కోట్ల రేంజ్ లో షేర్ ని సాధించి ఆల్ మోస్ట్ బిజినెస్ మీద డబుల్ ప్రాఫిట్స్ ను అందుకుని హ్యూజ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసి రవితేజ కి అద్బుతమైన కంబ్యాక్ మూవీ గా నిలిచి సత్తా చాటుకుంది. ఈ సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చి నేటితో 10 ఏళ్ళు కంప్లీట్ అవ్వడం విశేషం…