బాక్స్ ఆఫీస్ దగ్గర కింగ్ నాగార్జున యువ సామ్రాట్ నాగ చైతన్య ల లేటెస్ట్ మూవీ బంగార్రాజు రెండో వీకెండ్ ని పూర్తీ చేసుకుని ఇప్పుడు రెండో వారం వర్కింగ్ డేస్ లో ఎంటర్ అయింది, సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో సినిమా కి వర్కింగ్ డే ఇంపాక్ట్ వలన మరోసారి డ్రాప్స్ గట్టిగానే సొంతం అవ్వగా అనుకున్న రేంజ్ కన్నా కూడా డ్రాప్స్ సినిమా కి మరో సారి ఇబ్బంది పెట్టాయి.
3rd వేవ్ ఇంపాక్ట్ వలన నైజాంలో కలెక్షన్స్ మరీ తక్కువ వస్తూ ఉండగా అవి ఓవరాల్ కలెక్షన్స్ పై ఇంపాక్ట్ చూపుతున్నాయి. దాంతో సినిమా కలెక్షన్స్ ఓవరాల్ గా అనుకున్న అంచనాలను అందుకోవడం లేదు అని చెప్పాలి. రెండు తెలుగు రాష్ట్రాలలో బంగార్రాజు సినిమా 11 వ రోజున…
10 వ రోజు తో పోల్చితే 55% రేంజ్ లో డ్రాప్ అయినా ఓవరాల్ గా రోజును 40-45 లక్షల రేంజ్ కలెక్షన్స్ తో ముగిస్తుంది అనుకున్నా కానీ సినిమా ఓవరాల్ గా 36 లక్షల షేర్ ని మాత్రమే 11 వ రోజు సొంతం చేసుకుంది. ఇక సినిమా టోటల్ 11 డేస్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ లెక్క ఈ విధంగా ఉంది…
👉Nizam: 7.97Cr
👉Ceeded: 6.38Cr
👉UA: 4.81Cr
👉East: 3.86Cr
👉West: 2.73Cr
👉Guntur: 3.24Cr
👉Krishna: 2.10Cr
👉Nellore: 1.66Cr
AP-TG Total:- 32.75CR(53Cr~ Gross)
👉Ka+ROI: 1.69Cr
👉OS – 1.43Cr
Total WW: 35.87CR(60.10CR~ Gross)
ఇదీ మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 11 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ లెక్క. ఇక సినిమా మొత్తం మీద 11 రోజుల…
తర్వాత బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా కష్టపడాల్సిన అవసరం ఉండగా 39 కోట్ల టార్గెట్ ని అందుకోవాలి అంటే ఇంకా 3.13 కోట్ల రేంజ్ లో షేర్ ని సినిమా సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి. మరి మిగిలిన రన్ లో సినిమా ఎంతవరకు కలెక్షన్స్ ని సొంతం చేసుకుని ఈ మార్క్ ని అందుకుంటుందో చూడాలి.