బాక్స్ ఆఫీస్ దగ్గర 10 వ రోజు రెట్టించిన జోరు చూపెట్టి కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానా దగ్గుబాటి ల లేటెస్ట్ మూవీ భీమ్లా నాయక్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో వీకెండ్ స్టార్ట్ నిరాశ కలిగించే విధంగా ఉన్నా కానీ ఓవరాల్ గా వీకెండ్ ని బాగానే ముగించింది అని చెప్పాలి. ఇక సినిమా 11 వ రోజు లో ఎంటర్ అవ్వగా రెండు తెలుగు రాష్ట్రాలలో సినిమా….
అనుకున్న దాని కన్నా కూడా భారీగా డ్రాప్స్ ను సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహకందని రేంజ్ లో స్లో డౌన్ అయి పోయింది. రెండు తెలుగు రాష్ట్రాలలో 11 వ రోజు సినిమా కి మొత్తం మీద 50 లక్షల రేంజ్ లో కలెక్షన్స్ వస్తాయి అనుకున్నా కానీ….
సినిమా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లో కంప్లీట్ గా చేతులు ఎత్తేయడం తో కేవలం 36 లక్షల దాకా షేర్ ని మాత్రమే సొంతం చేసుకుని మైండ్ బ్లాంక్ చేసేలా డ్రాప్ అయింది, 10 వ రోజు తో పోల్చితే 11 వ రోజు ఏకంగా 1.54 కోట్లు డ్రాప్ అయింది సినిమా…
దాంతో ఓవరాల్ గా ఇప్పుడు భీమ్లా నాయక్ సినిమా కి 11 రోజులు పూర్తీ అయ్యే టైం కి వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి…
👉Nizam: 34.50Cr(Without GST- 31.45Cr)
👉Ceeded: 10.91Cr
👉UA: 7.44Cr
👉East: 5.38Cr
👉West: 4.91Cr
👉Guntur: 5.13Cr
👉Krishna: 3.70Cr
👉Nellore: 2.50Cr
AP-TG Total:- 74.47CR(113.60Cr~ Gross)
👉KA+ROI: 8.18Cr
👉OS: 12.43Cr
Total World Wide: 95.08CR(154.70CR~ Gross)
సినిమా టోటల్ బిజినెస్ 106.75 కోట్లు కాగా సినిమా 108 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా మొత్తం మీద ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ కాకుండా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా 12.92 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది, ఇక మిగిలిన రోజుల్లో ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.