Home న్యూస్ 50 కోట్ల సినిమాకి 11 రోజుల్లో వచ్చిన కలెక్షన్స్ ఇవి…పాపం!!

50 కోట్ల సినిమాకి 11 రోజుల్లో వచ్చిన కలెక్షన్స్ ఇవి…పాపం!!

1165
0

రీసెంట్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన సినిమాల్లో కంగనా రనౌత్ ముఖ్య పాత్రలో నటించిన తలైవి సినిమా ఒకటి, ఎప్పుడో షూటింగ్ ను పూర్తీ చేసుకున్న ఈ సినిమా ఆడియన్స్ ముందుకు థియేటర్స్ లో రిలీజ్ ను సమ్మర్ లో అనుకుంటే సెకెండ్ వేవ్ ఎఫెక్ట్ వలన కుదరలేదు, కానీ డిజిటల్ లో రిలీజ్ చేయడానికి భారీ ఆఫర్స్ వచ్చినా కానీ నో చెప్పగా…

సినిమాను థియేటర్స్ లోనే రిలీజ్ చేయాలనీ డిసైడ్ అయ్యి రీసెంట్ గా సినిమాను పాన్ ఇండియా లెవల్ లో భారీ ఎత్తున రిలీజ్ చేయగా మొత్తం మీద 6 రోజులు కంప్లీట్ అయ్యే టైం కి సినిమా 6.7 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని మొత్తం మీద సొంతం చేసుకోగా ఇప్పుడు…

11 రోజులు పూర్తీ అయ్యే టైం కి తమిళ్ లో 6.3 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని, హిందీ లో 2.1 కోట్ల గ్రాస్ ని తెలుగు లో 80 లక్షల గ్రాస్ ను సొంతం చేసుకుంది. టోటల్ గా 9.4 కోట్ల గ్రాస్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా అందులో షేర్ మొత్తం మీద 5 కోట్ల లోపే ఉంటుందట.

ఈ లెక్కన సినిమా బడ్జెట్ పరంగా చూసుకుంటే ఊహకందని దెబ్బ కొట్టినట్లే లెక్క అనుకోవాలి, సినిమాను 50 కోట్లకు పైగానే బడ్జెట్ తో తెరకెక్కించగా సినిమా బిజినెస్ ఏమి ఎక్కడా జరగలేదు, దాంతో థార్డ్ పార్టీ బయర్స్ తో సినిమా ను మేకర్స్ ఓన్ గానే మేజర్ ఏరియాలలో రిలీజ్ చేశారు… అయినా కానీ కలెక్షన్స్ ఏమాత్రం ఆశాజనకంగా లేక పోవడం విచారకరం అనే చెప్పాలి.

తమిళనాడు లో సినిమా పై ఎక్కువ హోప్స్ పెట్టుకున్నా అక్కడ కలెక్షన్స్ తీవ్రంగా శాకిచ్చాయి అని అంటున్నారు. తెలుగు రాష్ట్రలలో అసలు మినిమం ప్రమోషన్స్ లేకుండా రిలీజ్ అయిన ఈ సినిమాను అసలు పట్టించుకున్న వాళ్ళే లేరని చెప్పాలి. ఇక లాంగ్ రన్ లో సినిమా ఎంతవరకు కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి ఇక.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here