నాగ చైతన్య సాయి పల్లవి ల కాంబినేషన్ లో శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో రూపొందిన లేటెస్ట్ మూవీ లవ్ స్టొరీ బాక్స్ ఆఫీస్ పరిస్థితి చిత్ర విచిత్రంగా ఉంది, వీకెండ్ లో సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా వర్కింగ్ డేస్ కి వచ్చే సరికి డ్రాప్స్ ను ఎక్కువగా సొంతం చేసుకుంది. ఆ ఇంపాక్ట్ కలెక్షన్స్ పై గట్టిగా పడుతుంది. 10 వ రోజు ఆదివారం అవ్వడంతో అల్టిమేట్ కలెక్షన్స్ ని…
సొంతం చేసుకుని ఏకంగా 1.1 కోట్ల షేర్ ని సొంతం చేసుకున్న లవ్ స్టొరీ బాక్స్ ఆఫీస్ దగ్గర 11 వ రోజు కి వచ్చే సరికి డ్రాప్స్ 50% వరకు ఉండటంతో మినిమం 50 లక్షల షేర్ ని సొంతం చేసుకుంటుంది అని భావించినా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు…
ఓవరాల్ గా దెబ్బ కొట్టడంతో ఏకంగా 70% కి పైగా డ్రాప్స్ ను సొంతం చేసుకుని 11 వ రోజు 28 లక్షల షేర్ తోనే సరిపెట్టుకుంది…. రెస్ట్ ఆఫ్ ఇండియా లో తమిళనాడులో సినిమా కలెక్షన్స్ అప్ డేట్ అవ్వడంతో ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ కి మరింత చేరువ అవ్వడం విశేషం.
మొత్తం మీద ఇప్పుడు 11 రోజుల్లో సినిమా సాధించిన టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 11.75Cr
👉Ceeded: 4.16Cr
👉UA: 2.81Cr
👉East: 1.51Cr
👉West: 1.27Cr
👉Guntur: 1.45Cr
👉Krishna: 1.28Cr
👉Nellore: 83L
AP-TG Total:- 25.06CR(40.74CR~ Gross)
Ka+ROI: 1.91Cr( Tamilnadu Coll* updated)
OS – 4.74Cr~
Total WW: 31.71CR(56.50CR~ Gross)
ఇదీ సినిమా 11 రోజుల టోటల్ కలెక్షన్స్ లెక్క…
సినిమా టోటల్ బిజినెస్ 31.2 కోట్లు కాగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 32 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగగా 11 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 29 లక్షల షేర్ ని అందుకుంటే క్లీన్ హిట్ అవుతుంది. ఆల్ రెడీ మైనర్ ప్రాఫిట్స్ ను ఓవరాల్ గా సొంతం చేసుకున్న ఈ సినిమా త్వరలో క్లీన్ హిట్ కాబోతుంది.