ఆల్ టైమ్ టాప్ 6…ఏం కొట్టుడు సామి ఇది!

0
992

  యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ అరవింద సమేత వీర రాఘవ బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వీక్ తర్వాత రెండో వీకెండ్ లో కూడా సాలిడ్ కలెక్షన్స్ తో దుమ్ము లేపిన విషయం తెలిసిందే. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 11 రోజుల కలెక్షన్స్ తో ఏకంగా తెలుగు సినిమా చరిత్రలోనే అత్యధిక షేర్ ని సాధించిన సినిమాల సరసన నిలిచి ఆల్ టైమ్ హిస్టారికల్ రికార్డ్ ను సొంతం చేసుకుంది.

సినిమా 11 రోజుల్లో 93.43 కోట్ల షేర్ ని అందుకోగా బాహుబలి 2 సిరీస్ లు, రంగస్థలం, ఖైదీనంబర్ 150 మరియు భరత్ అనే నేను 101(ట్రేడ్ లెక్క) కోట్ల తర్వాత 6వ ప్లేస్ ని దక్కించుకుంది. కాగా సినిమా టోటల్ రన్ లో భరత్ అనే నేను మరియు….

ఖైదీనంబర్ 150 లను అందుకునే ఛాన్స్ గట్టిగానే ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మూడో వారంలో పెద్దగా పోటీ ఇచ్చే సినిమాలు లేకపోవడం తో సినిమా కొంచం హోల్డ్ చేసినా చాలని అంటున్నారు. మరి సినిమా ఎంతవరకు హోల్డ్ చేసి ఈ సినిమాలను దాటుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here