బాక్స్ ఆఫీస్ దగ్గర వర్కింగ్ డేస్ ఎఫెక్ట్ గట్టిగానే పడటంతో అల్లు అర్జున్ పుష్ప సినిమా కి సెకెండ్ వీకెండ్ తర్వాత వర్కింగ్ డే లో గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లు అయింది. సినిమా సెకెండ్ వీకెండ్ పూర్తీ అయ్యే టైం కి ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న తర్వాత వర్కింగ్ డే లో ఎంటర్ అవ్వగా అనుకున్న దానికన్నా కూడా రెండు తెలుగు రాష్ట్రాలలో డ్రాప్స్ మరీ ఎక్కువగా వచ్చాయి.
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 11 వ రోజు 1.5 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంటుంది అనుకున్నా కానీ ఆ రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకోలేక పోయిన సినిమా 1.05 కోట్ల షేర్ తోనే సరిపెట్టుకుని తీవ్రంగానే నిరాశ పరిచింది. వర్కింగ్ డేస్ ద్రపాస్ కామన్ కానీ ఈ సారి…..
డ్రాప్స్ మరింత ఎక్కువగా వచ్చాయి అని చెప్పొచ్చు. కానీ అదే టైం లో ఇతర రాష్ట్రాలలో స్ట్రాంగ్ కలెక్షన్స్ నే సొంతం చేసుకున్న సినిమా హిందీలో ఎక్స్ లెంట్ హోల్డ్ ని సొంతం చేసుకోవడం విశేషం అని చెప్పాలి. ఓవరాల్ గా సినిమా 11 రోజుల ఏరియాల వారి కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 37.85Cr(Without GST 34.92Cr)
👉Ceeded: 13.12Cr
👉UA: 7.20Cr
👉East: 4.40Cr
👉West: 3.63Cr
👉Guntur: 4.66Cr
👉Krishna: 3.82Cr
👉Nellore: 2.83Cr
AP-TG Total:- 77.51CR(120.08CR~ Gross)
👉Karnataka: 10.15Cr(Corrected)
👉Tamilnadu: 8.35Cr(Corrected)
👉Kerala: 4.60Cr(Corrected)
👉Hindi: 19.40Cr
👉ROI: 2.13Cr
👉OS – 12.45Cr
Total WW: 134.59CR(236CR~ Gross)
ఇదీ సినిమా 11 రోజుల టోటల్ కలెక్షన్స్ లెక్క…
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 146 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ కాకుండా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ కోసం సినిమా ఇంకా 11.41 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మిగిలిన రోజుల్లో ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.