నాచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ శ్యామ్ సింగ రాయ్ బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో వీకెండ్ ని పూర్తీ చేసుకుని వర్కింగ్ డేస్ లో ఎంటర్ అయింది, సినిమా తెలుగు రాష్ట్రాలలో డ్రాప్స్ ను హెవీగా సొంతం చేసుకుంది. అది అంచనాలను కూడా మించిపోయే రేంజ్ లో డ్రాప్స్ ను సొంతం చేసుకుంది ఈ సినిమా. తెలుగు రాష్ట్రాలలో సినిమా 11 వ రోజు మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర…
55% వరకు డ్రాప్ అయ్యి 50 లక్షలకి అటూ ఇటూగా షేర్ ని సొంతం చేసుకుంటుంది అనుకున్నా కానీ ఏకంగా 85% వరకు డ్రాప్స్ ను సొంతం చేసుకుంది, దానికి కారణం ఎక్కువ థియేటర్స్ లో 2 వ వారాన్ని కొనసాగిస్తున్న కారణంగా రెంట్స్ పోనూ షేర్ లు చాలా తక్కువగా రావడం జరిగింది…
అయినా కానీ హాలిడే నుండి వర్కింగ్ డే కి ఈ రేంజ్ డ్రాప్స్ అయితే అస్సలు ఊహించలేదు అనే చెప్పాలి. ఇక మొత్తం మీద 11 రోజులు కంప్లీట్ అయ్యే టైం కి శ్యామ్ సింగ రాయ్ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిన టోటల్ కలెక్షన్స్ ని ఒకసారి గమనిస్తే…
👉Nizam: 9.20Cr
👉Ceeded: 2.60Cr
👉UA: 2.10Cr
👉East: 1.06Cr
👉West: 82L
👉Guntur: 1.14Cr
👉Krishna: 92L
👉Nellore: 62L
AP-TG Total:- 18.46CR(31.35CR~ Gross)
Ka+ROI: 2.81Cr
OS – 3.50Cr
Total WW: 24.77CR(43.37CR~ Gross)
ఇదీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 11 రోజులు పూర్తీ అయ్యే టైం కి సాధించిన టోటల్ కలెక్షన్స్ లెక్క.
మొత్తం మీద సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 22.50 కోట్లు కాగా మొత్తం మీద 11 రోజుల తర్వాత బాక్స్ ఆఫీస్ దగ్గర 2.27 కోట్ల ప్రాఫిట్ ను సొంతం చేసుకుని క్లీన్ హిట్ గా నిలిచింది. లాంగ్ రన్ లో సినిమా మరింత హోల్డ్ చేస్తే సంక్రాంతి వరకు కలెక్షన్స్ ని సొంతం చేసుకోవచ్చు కానీ డ్రాప్స్ ఇలానే ఉంటే త్వరలోనే పరుగుని ముగించుకునే అవకాశం ఉంటుంది.