లాస్ట్ వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమాలు అన్నీ కూడా జనాలను థియేటర్స్ కి రప్పించడం లో విఫలం అవ్వడంతో థియేటర్స్ కి వెళ్లి సినిమా చూడాలి అనుకుంటున్న వాళ్ళకి ఉన్న ఆప్షన్స్ లో హాలీవుడ్ మూవీ షాంగ్ చీ మరియు అంతకన్నా ముందు వారం రిలీజ్ అయిన శ్రీదేవి సోడా సెంటర్ లు మాత్రమే కొంచం బెటర్ ఆప్షన్స్ లా కనిపిస్తున్నాయి ఇప్పుడు. దాంతో ఈ రెండు సినిమాలకే జనాలు వెళుతున్నారు.
షాంగ్ చీ వర్కింగ్ డే లో కూడా మంచి వసూళ్ళ తో హోల్డ్ చేయగా రెండో వీకెండ్ ని పూర్తీ చేసుకుని ఇప్పుడు వర్కింగ్ డేస్ లో ఎంటర్ అయిన శ్రీదేవి సోడా సెంటర్ సినిమా 10 వ రోజు ఆదివారం అవ్వడంతో 36 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా…
11 వ రోజు వర్కింగ్ డే అవ్వడం తో 10 వ రోజు తో పోల్చితే 55% వరకు డ్రాప్స్ ని సొంతం చేసుకున్నా ఈవినింగ్ షోలలో కొంచం గ్రోత్ ని చూపెట్టి మొత్తం మీద 17 లక్షల షేర్ ని సొంతం చేసుకుని బాగానే హోల్డ్ చేసింది. దాంతో ఇప్పుడు మొత్తం మీద 11 రోజుల్లో…
సినిమా వరల్డ్ వైడ్ గా సాధించిన టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 1.56Cr
👉Ceeded: 80L
👉UA: 70L
👉East: 43L
👉West: 25L
👉Guntur: 47L
👉Krishna: 26L
👉Nellore: 16L
AP-TG Total:- 4.63CR(7.75Cr Gross)
KA+ROI: 12L
OS: 27L~
Total Collections: 5.02CR(8.65CR~ Gross)
ఇదీ సినిమా 11 రోజుల్లో సాధించిన టోటల్ కలెక్షన్స్…
సినిమాను మొత్తం మీద 8 కోట్ల రేంజ్ రేటు కి అమ్మగా 8.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 11 రోజుల తర్వాత ఇంకా 3.48 కోట్ల షేర్ ని అందుకుంటేనే క్లీన్ హిట్ అవుతుంది. ఈ మార్క్ ని అందుకోవడం అసాధ్యం అయినా లాస్ ని లాంగ్ రన్ లో తగ్గించుకునే అవకాశం ఎంతైనా ఉందని వర్కింగ్ డేస్ లో సినిమా హోల్డ్ ని చూస్తె అర్ధం అవుతుంది.