బాక్స్ ఆఫీస్ దగ్గర పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ భీమ్లా నాయక్ మొదటి వారం మొత్తం మీద మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకున్నా కానీ కలెక్షన్స్ పరంగా వీక్ ఎండ్ టైం నుండి స్లో డౌన్ అయిన సినిమా ఓవరాల్ గా రెండో వారంలో సినిమా కొత్త సినిమాల నుండి పోటి ఎదురు అయినా కానీ థియేటర్స్ పరంగా మాత్రం సినిమా ఇతర సినిమాలను….
డామినేట్ చేస్తూ భీమ్లా నాయక్ సెకెండ్ వీక్ లో భారీగా థియేటర్స్ ని హోల్డ్ చేసి సంచలనం సృష్టించింది, సినిమా మొదటి వారంలో తెలుగు రాష్ట్రాలలో 1100 థియేటర్స్ లో రిలీజ్ అవ్వగా సినిమా రెండో వారానికి వచ్చే సరికి సినిమా నైజాంలో 229 థియేటర్స్ ని, సీడెడ్ ఏరియాలో 130 థియేటర్స్ ని….
ఇక ఇప్పుడు ఆంధ్ర రీజన్ లో 325 థియేటర్స్ ని హోల్డ్ చేసిన సినిమా మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాలలో 685 థియేటర్స్ ని హోల్డ్ చేసి పరుగును కొనసాగిస్తుంది… కొత్త సినిమాలు అన్నింటి కన్నా కూడా ఈ సినిమా భారీగా థియేటర్స్ ని హోల్డ్ చేయగా మొత్తం మీద ఇప్పుడు రెండో వారంలో కలెక్షన్స్ పరంగా సినిమా ఎలా హోల్డ్ చేస్తుందో చూడాలి…