బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహకందని కలెక్షన్స్ రికార్డులను సృష్టిస్తూ దూసుకు పోతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన లేటెస్ట్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ అయిన పుష్ప2(Pushpa2 The Rule Movie) 8 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా 244 కోట్లకు పైగా గ్రాస్ ను సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా సినిమా….
ఏకంగా 1059 కోట్లకు పైగా గ్రాస్ ను సొంతం చేసుకుని మాస్ రచ్చ చేయగా సినిమా ఇప్పుడు 9వ రోజున అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపడం విశేషం…సినిమా ట్రాక్ చేసిన సెంటర్స్ ను బట్టి 9వ రోజున తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా సినిమా ఇప్పుడు…
6 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా కర్ణాటక, తమిళ్ మరియు కేరళ కలిపి సినిమా 4.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా సినిమా ఇక హిందీలో మరోసారి ఎక్స్ లెంట్ గా జోరు చూపించడంతో అక్కడ సినిమా…
ఓవరాల్ గా 26-27 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా ఓవర్సీస్ లో మరోసారి హాల్ఫ్ మిలియన్ రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా మొత్తం మీద 9వ రోజు వరల్డ్ వైడ్ గా ఇప్పుడు 40-42 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా…
ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే గ్రాస్ మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక సినిమా ఈ రోజు కలెక్షన్స్ తో 9 రోజులు పూర్తి అయ్యే టైంకి ఓవరాల్ గా 250 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ ని అందుకున్న సినిమా వరల్డ్ వైడ్ గా రికార్డ్ బ్రేకింగ్ లెవల్ లో 1100 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉంది. ఇక సినిమా టోటల్ గా 9 రోజులకు సాధించే కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి…