కొత్త సినిమాలకు కూడా ధీటుగా అద్బుతమైన అడ్వాన్స్ బుకింగ్స్ తో మాస్ రచ్చ చేస్తూ దూసుకు పోతుంది టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) కెరీర్ లో చాలా స్పెషల్ సినిమా అయిన ఖలేజా(Khaleja4K Re Release) సినిమా…టాలీవుడ్ లో రీ రిలీజ్ మూవీస్ లో సెన్సేషనల్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకోవడానికి..
సిద్ధం అవుతున్న ఈ సినిమా అన్నీ అనుకున్నట్లు జరిగితే సౌత్ డే 1 రికార్డులను కూడా టార్గెట్ చేసే అవకాశం ఎంతైనా ఉంది. ఇక సినిమా మొదటి రోజు 59 వేల రేంజ్ లో టికెట్ సేల్స్ ను సొంతం చేసుకోగా రెండో రోజు 29 వేల రేంజ్ లో టికెట్ సేల్స్ ను సొంతం చేసుకోగా…
ఇక మూడో రోజున ఆల్ మోస్ట్ 17 వేల రేంజ్ లో టికెట్ సేల్స్ ను సొంతం చేసుకోగా ఓవరాల్ గా మూడు రోజుల్లో 105K టికెట్ సేల్స్ ను అందుకోగా నాలుగో రోజు బుకింగ్స్ తో 110K టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుని మాస్ రచ్చ చేస్తూ దూసుకు పోతూ ఉండగా…
టాలీవుడ్ తరుపున ఫాస్టెస్ట్ 1 లక్ష టికెట్ సేల్స్ తో సంచలనం సృష్టించిన ఖలేజా సినిమా ఓవర్సీస్ లో ఆల్ మోస్ట్ 23 వేల రేంజ్ లో అడ్వాన్స్ బుకింగ్స్ ను సొంతం చేసుకుంది. వరల్డ్ వైడ్ గా సినిమాకి ఇప్పటి వరకు జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ లెక్క..
3.25 కోట్ల రేంజ్ లో ఉండటం సూపర్ స్టార్ మహేష్ బాబు మాస్ పవర్ కి నిదర్శనం అని చెప్పాలి. అలాగే సినిమా మీద ఆడియన్స్ లో ఎలాంటి క్రేజ్ ఉందో చెప్పకనే చెబుతుంది. రిలీజ్ కి ఇంకా 4 రోజుల టైం ఉండగా రిలీజ్ టైంకి సినిమా..
మరింత జోరు చూపించే అవకాశం ఎంతైనా ఉండగా సాలిడ్ ఓపెనింగ్స్ ను అందుకునే అవకాశం ఉండగా కచ్చితంగా టాలీవుడ్ తరుపున మొదటి డబుల్ డిజిట్ గ్రాస్ వసూళ్ళని అందుకునే సినిమా అవుతుందని అందరూ నమ్ముతున్నారు. మరి మహేష్ ఈ మార్క్ ని ఎంతవరకు మించిపోతాడో చూడాలి.