Home గాసిప్స్ 111 కోట్ల సినిమా తెలుగు లో నితిన్…తమిళ్ లో ఈ హీరో ఏంటి సామి!!

111 కోట్ల సినిమా తెలుగు లో నితిన్…తమిళ్ లో ఈ హీరో ఏంటి సామి!!

780
0

కొన్ని సినిమాలు కొందరికి సూట్ అవుతాయి, ఏజ్ ఫాక్టర్ కూడా కీలకమే, యంగ్ హీరోలు చేసే సినిమాలు సీనియర్స్ చేయలేరు, సీనియర్స్ చేయాల్సిన సినిమాలు యంగ్ హీరోలు చేస్తే వాటిని ఎవ్వరూ పట్టించుకోరు కూడా. ఇప్పుడు బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన సినిమా సౌత్ రీమేక్ ల విషయం లో ఇలాంటిదే జరుగుతుండగా ఈ కాంబినేషన్ లు చూసి అందరూ ఒకింత షాక్ కి గురి అవుతున్నారు అనే చెప్పాలి.

రెండేళ్ళ క్రితం హిందీ లూ యంగ్ హీరో ఆయుష్మాన్ ఖురానా నటించిన అంధ ధూన్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేయగా ఈ సినిమా ను ఇప్పుడు రెండున్నర ఏళ్ల తర్వాత తెలుగు తమిళ్ లో రీమేక్ చేయడానికి సిద్ధం చేస్తున్నారు.

తెలుగు వరకు కాంబినేషన్ అదిరిపోయే రేంజ్ లో సెట్ అయినప్పటికీ తమిళ్ లో మాత్రం షాక్ ఇచ్చేలా ఉంది, తెలుగు లో మేర్లపాక గాంధీ డైరెక్షన్ లో నితిన్ హీరోగా తమన్నా, నబా నటేష్ ల కాంబినేషన్ లో ఆల్ మోస్ట్ 40 కోట్ల రేంజ్ బడ్జెట్ తో భారీ లెవల్ లో రూపొందుతున్న ఈ సినిమా..

తమిళ్ కి వచ్చే సరికి ధృవ ఒరిజినల్ తనీ ఒరువన్ డైరెక్టర్ మోహన్ రాజా డైరెక్ట్ చేస్తుండగా హీరోగా యంగ్ అండ్ క్రేజీ హీరోలలో ఎవరినైనా తీసుకుంటారేమో అనుకుంటే జీన్స్ తర్వాత అసలు హిట్స్ లేక మార్కెట్ మొత్తం కోల్పోయిన ప్రశాంత్ తో ఈ బ్లాక్ బస్టర్ రీమేక్ ని చేస్తున్నారని కోలివుడ్ లో చెప్పుకుంటున్నారు.

ఇది వరకు అల్లు అర్జున్ జులాయి ని కూడా రీమేక్ చేసి అట్టర్ ఫ్లాఫ్ ని సొంతం చేసుకోగా తెలుగు లో వినయ విదేయ రామ లో రామ్ చరణ్ అన్నయ్య రోల్ చేసిన ప్రశాంత్ ఏజ్ కి ఈ రోల్ కి ప్రజెంట్ తన మార్కెట్ కి ఏమాత్రం సంభందం లేదనే అంటున్నారు. మరి ఇది కన్ఫాం అయితే మట్టుకు తమిళ్ లో సినిమా రిజల్ట్ తేడా కొట్టే అవకాశం ఉందని అంటున్నారు మరి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here