బాక్స్ ఆఫీస్ దగ్గర నాచురల్ స్టార్ నాని కీర్తి సురేష్ ల లేటెస్ట్ మూవీ దసరా రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో మొదటి వీకెండ్ ని కంప్లీట్ చేసుకుంది. సినిమా కి తెలుగు రాష్ట్రాలలో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ సొంతం అవ్వగా ముఖ్యంగా నైజాంలో సినిమా ఎపిక్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపుతూ దూసుకు పోతుంది. కానీ ముందు నుండి టీం ఎన్నో ఆశలు పెట్టుకున్న….
హిందీ వర్షన్ మాత్రం అండర్ పెర్ఫార్మ్ చేస్తూనే ఉంది. అక్కడ సినిమా కోసం బాగా ప్రమోషన్స్ చేసినా కానీ అనుకున్న రేంజ్ లో ఓపెనింగ్స్ రాలేదు. కానీ రివ్యూలు రేటింగ్ లు పాజిటివ్ గా ఉండటంతో సినిమాను జనాల్లోకి ఎలాగైనా తీసుకు పోవాలని టీం ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నారు…
PVR, ఇనాక్స్, సినీ పోలిస్ లాంటి మేజర్ చైన్ థియేటర్స్ తో పాటు మరికొన్ని థియేటర్స్ లో నార్త్ బెల్ట్ లో సినిమాకి సోమవారం నుండి గురువారం వరకు టికెట్ రేటుని 112 కి ఫిక్స్ చేశారు… దాంతో సినిమా టాక్ ఎలాగూ బాగానే ఉండటంతో ఈ రేటు చూసి అయినా జనాలు థియేటర్స్ లోకి వస్తే…
వీకెండ్ కి మళ్ళీ ఇది అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంటుంది అన్న ఆశతో టికెట్ రేట్స్ ని తగ్గించారు. ఇది వర్కౌట్ అయితే ఎక్కువ మంది జనాలు ఇప్పుడు వర్కింగ్ డేస్ లో సినిమాను చూడొచ్చు టాక్ మరింతగా స్ప్రెడ్ అయ్యి వీకెండ్ లో సినిమా గ్రోత్ ని సొంతం చేసుకోవచ్చు. మరి ఇది వర్కౌట్ అవుతుందో లేదో కొన్ని రోజుల్లో తేలనుంది…