Home న్యూస్ 3 రోజుల్లో 115 కోట్లు…ఊపిరి పోయడం కాదు…ఇండియన్ రికార్డ్ ఔట్!!

3 రోజుల్లో 115 కోట్లు…ఊపిరి పోయడం కాదు…ఇండియన్ రికార్డ్ ఔట్!!

1517
0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఏడాదిన్నరగా ఒక్కటంటే ఒక్క మంచి హిట్ ని సొంతం చేసుకోలేక పోయిన బాలీవుడ్ ఇండస్ట్రీకి తిరిగి ఊపిరి పోయడానికి ఎవరు వస్తారా అని ఆశగా ఎదురు చూస్తున్న టైం లో ఏడాదిన్నర నుండి పెండింగ్ లో ఉన్న అక్షయ్ కుమార్ సూర్యవంశీ సినిమా ఆడియన్స్ ముందుకు దీపావళి వీకెండ్ ని భారీగా రిలీజ్ ను సొంతం చేసుకోగా సినిమా కి మరీ అద్బుతం అనిపించే రేంజ్ టాక్ ఏమీ….

రాక పోయినా కానీ బాలీవుడ్ ఆడియన్స్ కి నచ్చే ఫైట్స్ అండ్ మాస్ ఎలిమెంట్స్ సినిమా ఉండటంతో బాక్స్ ఆఫీస్ ను ఓ రేంజ్ లో షేక్ చేయడమే కాదు ఇప్పుడు సెకెండ్ వేవ్ తర్వాత ఇండియన్ బాక్స్ ఆఫీస్ రికార్డులను కూడా తిరగరాస్తూ దూసుకు పోతుంది ఈ సినిమా..

మొదటి మొదటి రోజు 27 కోట్ల నెట్ కలెక్షన్స్ ని ఇండియాలో సొంతం చేసుకోగా రెండో రోజు 23.85 కోట్ల నెట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని సాలిడ్ గా హోల్డ్ చేసి మూడో రోజు మొదటి రోజుకి మించి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ 28.5 కోట్ల నెట్ కలెక్షన్స్ ని దక్కించుకుంది.

దాంతో సినిమా 3 రోజుల్లో టోటల్ ఇండియాలో 79.35 కోట్ల నేనట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకోగా టోటల్ గ్రాస్ 96 కోట్ల మార్క్ ని అందుకుంది. దాంతో సినిమా ఓవర్సీస్ లో టోటల్ గా 3 రోజులు పూర్తీ అయ్యే టైం కి 19 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని ఓవరాల్ గా సొంతం చేసుకోగా 3 రోజుల టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ 115 కోట్ల మార్క్ ని అందుకుంది.

రీసెంట్ గా రజినీకాంత్ అన్నట్టే 3 రోజుల్లో 100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ తో ఇండియన్ రికార్డ్ ను నమోదు చేయగా 24 గంటలు గడవకముందే ఆ రికార్డ్ ను బ్రేక్ చేసి సరికొత్త ఇండియన్ రికార్డ్ ను నమోదు చేసింది సూర్యవంశీ. దాంతో బాలీవుడ్ కి తిరిగి ఊపిరి పోయడమే కాదు కొత్త రికార్డులతో దుమ్ము దుమారం చేస్తూ ఉండటం ఇక్కడ విశేషం అని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here