Home న్యూస్ 20 కోట్ల వైపు ఛావా చూపు….11 డేస్ తెలుగు టోటల్ కలెక్షన్స్!

20 కోట్ల వైపు ఛావా చూపు….11 డేస్ తెలుగు టోటల్ కలెక్షన్స్!

0

అన్ని చోట్లా అంచనాలను మించే రేంజ్ లో వసూళ్ళతో భీభత్సం సృష్టించి దుమ్ము దుమారం లేపిన  విక్కీ కౌశల్(Vicky Kaushal) నటించిన లేటెస్ట్ మూవీ ఛావా(Chhaava Telugu) సినిమా హిందీలో హిస్టారికల్ జానర్ లో ఆల్ టైం ఎపిక్ రికార్డులను నమోదు చేయగా తెలుగు లో కూడా రీసెంట్ గా డబ్ అయ్యి..

ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపుతూ లాంగ్ రన్ ను ఎంజాయ్ చేస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి. సినిమా రెండో వీకెండ్ వరకు ఎక్స్ లెంట్ హోల్డ్ ని చూపెడుతూ రోజుకి యావరేజ్ గా 70-80 లక్షల రేంజ్ కి తగ్గని గ్రాస్ ను అందుకుంటూ..

మాస్ రచ్చ చేసింది. ఇక సినిమా రెండో వీక్ వర్కింగ్ డేస్ లో అడుగు పెట్టగా మరోసారి మంచి హోల్డ్ ని చూపించిన సినిమా సూపర్ స్టడీగానే హోల్డ్ ని కొనసాగిస్తూ ఉండటంతో లాంగ్ రన్ లో తెలుగు రాష్ట్రాల నుండి… 20 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని ఇప్పుడు టార్గెట్ చేసిందని చెప్పాలి.

సినిమా తెలుగు రాష్ట్రాల్లో 11వ రోజున 40 లక్షల రేంజ్ లో గ్రాస్ ను ఓవరాల్ గా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ హెల్ప్ తో సొంతం చేసుకుని సండే తో పోల్చితే 50% రేంజ్ లోనే డ్రాప్స్ ను సొంతం చేసుకోగా… ఓవరాల్ గా ఇప్పుడు 11 రోజులు పూర్తి అయ్యే టైంకి…

తెలుగు రాష్ట్రాల్లో 16.25 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని సొంతం చేసుకుని మాస్ కుమ్ముడు కుమ్మేసింది. షేర్ పరంగా 8.25 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని ఎక్స్ లెంట్ గా కుమ్మేసిన సినిమా 3 కోట్ల వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఏకంగా…

5.25 కోట్ల రేంజ్ లో లాభాన్ని సొంతం చేసుకుని ఇప్పుడు ఓవరాల్ గా డబుల్ బ్లాక్ బస్టర్ నుండి ఆల్ మోస్ట్ ట్రిపుల్ బ్లాక్ బస్టర్ రేంజ్ లో మాస్ కుమ్ముడు కుమ్మేయడానికి సిద్ధం అవుతూ ఉండగా ఈ నెల ఎండ్ వరకు లాభాలను ఇంకా పెంచుకునే అవకాశం ఎంతైనా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here