మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్(Mohan Lal) కి ఈ ఇయర్ ఓ రేంజ్ లో కలిసి వచ్చింది అని చెప్పాలి. బాక్స్ ఆఫీస్ దగ్గర మిక్సుడ్ టాక్ తో కూడా లూసిఫర్2 రిమార్కబుల్ కలెక్షన్స్ ని అందుకోగా… తర్వాత వచ్చిన తుడరుం మూవీ కేరళ ఇండస్ట్రీ రికార్డుల బెండు తీసి సంచలనం సృష్టించింది. ఇక ఈ మధ్యనే…
మోహన్ లాల్ 18 ఏళ్ల క్రితం నటించిన ఓల్డ్ మూవీ రీ రిలీజ్ అయ్యి కేరళలో రీ రిలీజ్ మూవీస్ లో సెకెండ్ బెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ రికార్డులు క్రియేట్ చేస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి. అక్కడ రీ రిలీజ్ మూవీస్ లో మోహన్ లాల్ నటించిన…
ధైవదూతన్ అనే సినిమా 5.3 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ తో మలయాళ సినిమాల్లో రికార్డ్ వసూళ్ళని రీ రిలీజ్ లో సొంతం చేసుకోగా ఇప్పుడు ఆ సినిమా తర్వాత మోహన్ లాల్ 18 ఏళ్ల క్రితం నటించిన చొట్ట ముంబై(Chotta Mumbai4K) సినిమాను ఈ మధ్యనే రీ రిలీజ్ చేయగా…
11 రోజుల పాటు మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకుని రచ్చ చేసిన ఈ సినిమా కేరళలో 3.45 కోట్ల రేంజ్ లో వసూళ్ళని సొంతం చేసుకోగా ఓవర్సీస్ లో 40 లక్షల రేంజ్ లో వసూళ్ళ ని సొంతం చేసుకుని సాలిడ్ ట్రెండ్ ను చూపించి రచ్చ లేపగా…
ఓవరాల్ గా ఇప్పటి వరకు సినిమా 3.85 కోట్ల రేంజ్ లో వసూళ్ళతో రీ రిలీజ్ మలయాళం మూవీస్ లో ఆల్ టైం సెకెండ్ హైయెస్ట్ వసూళ్ళని అందుకుని కుమ్మేసింది. కొత్త సినిమాలతో రికార్డులను అందుకోవడమే కాదు ఓల్డ్ మూవీస్ తో కూడా రీ రిలీజ్ లో రికార్డులతో మోహన్ లాల్ మాస్ భీభత్సం సృష్టిస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి.