బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి మిక్సుడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోవడం, ఇతర సినిమాలు పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకోవడంతో ఏ దశలో కూడా అంచనాలను అందుకోలేక పోతున్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ గేమ్ చంజేర్ మూవీ మొదటి 10 రోజులు ఓవరాల్ గా సంక్రాంతి లాంగ్ వీక్ వలన…
ఎలాగోలా హోల్డ్ ని చూపించింది కానీ 11వ రోజున వర్కింగ్ డే ఇంపాక్ట్ వలన బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్న దానికి మించి డ్రాప్స్ ను సొంతం చేసుకోగా…ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర గేమ్ చేంజర్ టాలీవుడ్ హిస్టరీలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డిసాస్టర్ గా నిలవడం ఖాయంగా కనిపిస్తూ ఉంది ఇప్పుడు…
మొత్తం మీద సినిమా 11వ రోజున తెలుగు రాష్ట్రాల్లో 34 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న సినిమా వరల్డ్ వైడ్ గా ఓవరాల్ గా 52 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా 1.15 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది….దాంతో టోటల్ గా 11 రోజుల్లో సినిమా వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Game Changer 11 Days Total World Wide Collections Report(Inc GST)
👉Nizam: 18.87CR
👉Ceeded: 10.21CR
👉UA: 10.25CR
👉East: 7.88CR
👉West: 4.08CR
👉Guntur: 6.62CR
👉Krishna: 5.30CR
👉Nellore: 3.83CR
AP-TG Total:- 67.04CR(98.95CR~ Gross)
👉KA: 4.86Cr
👉Tamilnadu: 4.22Cr
👉Kerala: 25L~
👉Hindi+ROI: 17.18Cr
👉OS – 13.30Cr****approx
Total WW Collections: 106.85CR(Gross- 195.65CR~)
(48%~ Recovery)
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 223 కోట్ల మమ్మోత్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 116 కోట్లకు పైగా షేర్ ని సాధించాల్సి ఉంటుంది. దాంతో ఇక చరిత్ర కెక్కే డిసాస్టర్ గా సినిమా నిలవడం ఖాయంగా కనిపిస్తుంది…