లాస్ట్ వీక్ లో ఆడియన్స్ ముందుకు మంచి అంచనాల నడుమ వచ్చి ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో మాస్ రచ్చ చేస్తూ దూసుకు పోతున్న నాచురల్ స్టార్ నాని(Nani) నటించిన లేటెస్ట్ మూవీ హిట్3(Hit 3 Movie) సినిమా రెండో వీకెండ్ లో మరోసారి అన్ని చోట్లా మాస్ కుమ్ముడు కుమ్మేసింది. 11వ రోజున సండే అడ్వాంటేజ్ తో…
మరీ అనుకున్న అంచనాలను మించి పోలేదు కానీ ఉన్నంతలో మరోసారి మంచి జోరునే చూపించి లాభాలను మరింతగా పెంచుకుని కుమ్మేయడం విశేషం అని చెప్పాలి. సినిమా ఓవరాల్ గా 11వ రోజున మరోసారి 1.2-1.4 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ ని అందుకుంటుంది అనుకున్నా…
ఓవరాల్ గా సినిమా 1.10 కోట్ల రేంజ్ లో షేర్ ని తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకుంది. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 1.40 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా 2.60 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని వరల్డ్ వైడ్ గా అందుకోగా ఓవరాల్ గా ఇప్పుడు సినిమా 11 రోజులు పూర్తి అయ్యే టైంకి…
టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Nani Hit3 Movie 11 Days Total WW Collections Report(Inc Gst)
👉Nizam: 17.28Cr
👉Ceeded: 4.85Cr
👉UA: 4.80Cr
👉East: 2.64Cr
👉West: 2.12Cr
👉Guntur: 2.68Cr
👉Krishna: 2.40Cr
👉Nellore: 1.23Cr
AP-TG Total:- 38.00CR(66.55CR~ Gross)
👉KA+ROI – 6.65Cr
👉Other Languages – 1.90Cr~
👉OS – 12.20Cr~….Approx
Total World Wide – 58.75CR(111.40CR~ Gross)
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా 11 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో 8.75 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని హిట్ నుండి సూపర్ హిట్ గా నిలిచింది. ఇక మిగిలిన రన్ లో సినిమా ఇంకా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.