బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ టైంలో వరుస ఫ్లాఫ్స్ తో ఉన్న బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్(Akshay Kumar)నటించిన హౌస్ ఫుల్ 5(HouseFull5 Movie) మూవీతో రీసెంట్ గా మళ్ళీ మునుపటి ఫామ్ ని మరిపించే రేంజ్ లో ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుని మాస్ రచ్చ చేయగా కలెక్షన్స్ పరంగా కూడా లాంగ్ రన్ లో స్టడీగా…
జోరుని చూపెడుతూ దూసుకు పోతూ ఉంది. సినిమా రెండో వీకెండ్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి జోరుని చూపించింది… మొదటి వారంలో ఓవరాల్ గా 133.58 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకోగా రెండో వీకెండ్ లో మరోసారి జోరు ని చూపించిన సినిమా..
29.11 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకుంది. దాంతో టోటల్ గా 10 రోజులు కంప్లీట్ అయ్యే టైంకి సినిమా ఓవరాల్ గా 162.69 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకోగా 11వ రోజున వర్కింగ్ డేస్ లోకి అడుగు పెట్టిన సినిమా ఓవరాల్ గా మరోసారి…
పర్వాలేదు అనిపించేలా హోల్డ్ చేస్తూ 4 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకోగా ఓవరాల్ గా 11 రోజులు కంప్లీట్ అయ్యే టైంకి ఓవరాల్ గా 166.69 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకుని 200 కోట్ల నెట్ కలెక్షన్స్ మార్క్ వైపు పరుగులు పెడుతూ ఉండటం విశేషం అని చెప్పాలి.
ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ హిట్ అనిపించుకోవాలి అంటే మినిమమ్ 220 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకోవాల్సిన అవసరం ఉండగా మిగిలిన రన్ లో సినిమా మరో 53 కోట్లకు పైగా వసూళ్ళని అందుకోవాల్సిన అవసరం ఉంది, ఇక మిగిలిన రన్ లో సినిమా ఎంతవరకు జోరు కొనసాగిస్తుందో చూడాలి ఇక…