Home న్యూస్ 11వ రోజు మళ్ళీ ఇండస్ట్రీ రికార్డ్….అల్లకల్లోలం చేస్తున్న స్త్రీ2 మూవీ!

11వ రోజు మళ్ళీ ఇండస్ట్రీ రికార్డ్….అల్లకల్లోలం చేస్తున్న స్త్రీ2 మూవీ!

0

బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎవ్వరూ ఊహించని రేంజ్ లో రికార్డుల భీభత్సం సృష్టిస్తూ దూసుకు పోతున్న హ్యుమంగస్ బ్లాక్ బస్టర్ మూవీ అయిన శ్రద్దా కపూర్(Shraddha Kapoor) నటించిన స్త్రీ2(Stree2 Movie) మొదటి వారంలో రికార్డుల జాతర సృష్టించిన తర్వాత రెండో వీకెండ్ లో మరింత జోరు చూపించి ఇండస్ట్రీ రికార్డులతో…

దుమ్ము దుమారం లేపుతూ దూసుకు పోతూ ఉంది..సినిమా 10వ రోజు రెండో శనివారం బాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డ్ ను నమోదు చేయగా 11వ రోజు రెండో సండే అడ్వాంటేజ్ తో మరింత జోరు చూపించి బాలీవుడ్ లో మరోసారి ఇండస్ట్రీ రికార్డ్ ను నమోదు చేసింది ఇప్పుడు…

అంచనాలను అన్నీ కూడా మించి పోయిన 40.75 కోట్ల ఎపిక్ నెట్ కలెక్షన్స్ ని అందుకుని మాస్ ఊచకోత కోసింది ఇప్పుడు…ఇది వరకు గదర్2 మూవీ రెండో సండే లో ఆల్ మోస్ట్ 39 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకోగా ఇప్పుడు స్త్రీ2 మూవీ అన్ని రికార్డులను బ్రేక్ చేసింది.

ఇక సినిమా టోటల్ గా 11 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
#Stree2 HUMONGOUS Collections
👉Previews – 9.40CR
👉Day 1 – 55.40CR
👉Day 2 – 35.30CR
👉Day 3 – 45.70CR
👉Day 4 – 58.20CR
👉Day 5 – 38.40CR
👉Day 6 – 26.80CR
👉Day 7 – 20.40CR
👉Day 8 – 18.20CR
👉Day 9 – 19.30CR
👉Day 10 – 33.80CR
👉Day 11 – 40.75CR
Total Collections – 401.65CR NET💥💥💥💥

11 రోజుల్లో అంచనాలను మించి పోయిన సినిమా ఏకంగా 400 కోట్ల నెట్ కలెక్షన్స్ మార్క్ ని దాటేసి ఇప్పుడు 500 కోట్ల నెట్ కలెక్షన్స్ మార్క్ వైపు పరుగులు పెడుతూ ఉండగా 12వ రోజు మరోసారి కృష్ణాష్టమి పార్షిక హాలిడే అడ్వాంటేజ్ ఉండటంతో మరోసారి మాస్ రచ్చ చేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here