బాక్స్ ఆఫీస్ దగ్గర యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కాంబినేషన్ లో ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ ఆర్ ఆర్ ఆర్ మూవీ రెండో వీకెండ్ ని ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో ముగించిన తర్వాత ఇప్పుడు మళ్ళీ వర్కింగ్ డే లో ఎంటర్ అయింది. సినిమా కి రిలీజ్ అయిన రోజు నుండి 10 రోజుల పాటు పెంచిన భారీ టికెట్ రేట్స్ ని…
ఈ రోజు నుండి నార్మల్ రేటుకి పెట్టారు, కానీ నైజాంలో మల్టీప్లెక్సులలో 295 వరకు రేటు ఇప్పటికీ ఉండగా సింగిల్ స్క్రీన్స్ లో 150, 175 రేట్లు ఉండగా ఆంధ్రలో 150, 170 రేంజ్ లో రేట్స్ ఉన్నాయి. ఇక సినిమా 11 వ రోజు వర్కింగ్ డే అవ్వడంతో డ్రాప్స్ ఎక్కువగానే ఉన్నాయి….
మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలకు ఆల్ మోస్ట్ 10 వ రోజు తో పోల్చితే 11వ రోజు డ్రాప్స్ ఆల్ మోస్ట్ 50-55% రేంజ్ లో ఉన్నాయి అని చెప్పాలి… దానికి తోడూ రేట్స్ కూడా తగ్గడంతో ఇప్పుడు ఓవరాల్ గా రోజు మొత్తం బాగుంటే సినిమా తెలుగు రాష్ట్రాలలో 5.5 కోట్ల నుండి 6 కోట్ల రేంజ్ లో…
షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉండగా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే కలెక్షన్స్ కొంచం పెరగొచ్చు… సినిమా ఇక హిందీ లో ఈ రోజు 11-13 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని నెట్ రూపంలో సొంతం చేసుకునే అవకాశం ఉండగా కర్ణాటక, తమిళనాడు మరియు కేరళలో సినిమా ఈ రోజు 4-4.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చు…
ఇక మొత్తం మీద సినిమా ఈ రోజు ఇండియాలో 15 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చు, ఓవర్సీస్ కలెక్షన్స్ తో సినిమా 17 కోట్ల రేంజ్ లో వసూళ్లు అందుకునే అవకాశం ఉంది, ఈ రోజు కలెక్షన్స్ తో సినిమా మమ్మోత్ 500 కోట్ల షేర్ మార్క్ ని అందుకోగా… ఈవినింగ్ అండ్ నైట్ షోల లెక్కలు అన్నీ ఈ రేంజ్ లో ఉంటాయో లేక ఏమైనా గ్రోత్ లేదా తగ్గుతుందో చూసి మరో ఆర్టికల్ లో అప్ డేట్ చేస్తాం…