రామ్ పోతినేని లేటెస్ట్ మూవీ ది వారియర్ బాక్స్ ఆఫీస్ దగ్గర10వ రోజు పర్వాలేదు అనిపించే విధంగా గ్రోత్ ని చూపించగా సినిమా 10వ రోజు తో పోల్చితే ఇప్పుడు 11వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో కొన్ని సెంటర్స్ లో 10% రేంజ్ లో గ్రోత్ ని చూపించింది అని చెప్పాలి…
ఇదే విధంగా అన్ని సెంటర్స్ లో జోరు కొనసాగిస్తే మొత్తం మీద ఇప్పుడు 11వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమా 36 లక్షల నుండి 40 లక్షల దాకా షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి.
ఇక అన్ని సెంటర్స్ లో లెక్కలు ఇంకొంచం పెరిగితే 45 లక్షల దాకా షేర్ ని అందుకోవచ్చు. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 50 లక్షల నుండి 55 లక్షల లోపు షేర్ ని సినిమా సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఇక అఫీషియల్ 11 డేస్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.