బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన రోజు నుండి కూడా ఊహకందని కలెక్షన్స్ తో ఊచకోత కోస్తూ ఆల్ మోస్ట్ మీడియం రేంజ్ మూవీ కి ఏమాత్రం తీసిపోని రేంజ్ లో వసూళ్ళ జోరుని చూపించిన నాచురల్ స్టార్ నాని(Nani) నిర్మాతగా నిర్మించిన లేటెస్ట్ మూవీ కోర్ట్(Court State Vs A Nobody Movie) సినిమా రెండో వీకెండ్ వరకు…
రిమార్కబుల్ జోరుని చూపించగా ఎట్టకేలకు బాక్స్ ఆఫీస్ దగ్గర 11వ రోజున ఫుల్ వర్కింగ్ డే ఇంపాక్ట్ వలన కొంచం స్లో డౌన్ అయింది. మొదటి 10 రోజుల్లో ఎక్స్ లెంట్ రాంపెజ్ ను చూపించిన ఈ సినిమా 11వ రోజున 10వ రోజుతో పోల్చితే ఆల్ మోస్ట్…
60-65% రేంజ్ లో టికెట్ సేల్స్ లో డ్రాప్స్ ను సొంతం చేసుకోగా…ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ పరంగా కూడా ఈ డ్రాప్స్ ఉండే అవకాశం ఉండగా….ఓవరాల్ గా సినిమా 11వ రోజున బాక్స్ ఆఫీస్ తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా 45-50 లక్షల రేంజ్ లో షేర్ ని…
కొంచం అటూ ఇటూగా సొంతం చేసుకునే అవకాశం ఉండగా…ఫైనల్ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి కలెక్షన్స్ కొంచం అటూ ఇటూగా ఉండొచ్చు. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 60-65 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉంది.
ఓవరాల్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎపిక్ రన్ కి ఈ రోజు బ్రేక్స్ పడ్డాయి అని చెప్పాలి. ఇక మిగిలిన రన్ లో సినిమా లాభాలను ఇంకా పెంచుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి… ఇక టోటల్ గా 11 రోజులకు గాను టోటల్ గా సాధించే కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.