బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో వీక్ వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అయిన నట సింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) నటించిన లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్(Daaku Maharaaj Movie) సినిమా వర్కింగ్ డేస్ లో లిమిటెడ్ డ్రాప్స్ నే సొంతం చేసుకుంటూ మంచి హోల్డ్ తో ఇప్పుడు బ్రేక్ ఈవెన్ మార్క్ వైపు ఒక్కో అడుగు ముందుకు వేస్తుంది..
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 10వ రోజు తో పోల్చితే ఇప్పుడు 11వ రోజున మరోసారి మంచి హోల్డ్ ని చూపెడుతూ ఉండగా మేజర్ సెంటర్స్ లో డీసెంట్ షేర్స్ ని సొంతం చేసుకుంటూ ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ మార్క్ వైపు పరుగులు పెడుతుంది…
మొత్తం మీద ట్రాక్ చేసిన సెంటర్స్ లో సినిమా ఓవరాల్ గా ఇప్పుడు 60 లక్షల రేంజ్ కి అటూ ఇటూ గా షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా, ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు కనుక బాగుంటే షేర్ ఇంకొంచం పెరిగే అవకాశం కనిపిస్తుంది…
ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ లో పర్వాలేదు అనిపిస్తున్న సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 11వ రోజున ఇప్పుడు 70 లక్షల రేంజ్ కి అటూ ఇటూగా షేర్ ని అందుకునే అవకాశం ఉంది. మాస్ సెంటర్స్ లో సినిమా మంచి హోల్డ్ ని చూపెడుతూ ఉండటంతో…
ఈ వీకెండ్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి జోరు చూపించి బ్రేక్ ఈవెన్ మార్క్ ని దాటేసే అవకాశం ఉంది, మొత్తం మీద వరల్డ్ వైడ్ గా 11వ రోజున సినిమా 1.3 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా ఇక టోటల్ గా 11 రోజుల్లో సినిమా ఏరియాల వారిగా సాధించే కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.