బాక్స్ ఆఫీస్ దగ్గర 10 రోజుల్లో ఊహకందని రేంజ్ లో ఊచకోత కోసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ మూవీ దేవర(Devara) ఎక్స్ లెంట్ ప్రాఫిట్స్ తో దుమ్ము దుమారం లేపుతూ దూసుకు పోతూ ఉండగా సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు, హిందీ మరియు కర్ణాటకలో ఎక్స్ లెంట్ గా ట్రెండ్ ను చూపెడుతూ దుమ్ము లేపింది…
ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 10వ రోజు సండే రోజున ఊచకోత కోసిన తర్వాత 11వ రోజు వర్కింగ్ డే లోకి ఎంటర్ అయినా కూడా దసరా సెలవులు పిల్లలకు అలాగే స్టూడెంట్స్ కి స్టార్ట్ అవ్వడంతో ఆ ఇంపాక్ట్ వలన సినిమా నార్మల్ వర్కింగ్ డే లో ఉండే రేంజ్ లో…
డ్రాప్స్ కన్నా కూడా బెటర్ గా హోల్డ్ చేస్తూ దూసుకు పోతుంది…మొత్తం మీద ట్రాక్ చేసిన సెంటర్స్ లో సినిమా బుకింగ్స్ 7వ రోజు లెవల్ లో కనిపిస్తూ ఉన్నాయి, ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు ఇదే రేంజ్ లో ఉండే అవకాశం ఉంది, దాంతో మంచి ఆక్యుపెన్సీతో రన్ ని…
కొనసాగిస్తున్న సినిమా కి టికెట్ హైక్స్ తగ్గడం ఇప్పుడు డీసెంట్ ఆక్యుపెన్సీతో రన్ ని వర్కింగ్ డేస్ లో కొనసాగిస్తూ ఉండటం విశేషం, వర్కింగ్ డే లో హెవీ డ్రాప్స్ ఉంటాయి అనుకున్నా దేవర మంచి హోల్డ్ ని చూపెడుతూ ఉండగా… టికెట్ హైక్స్ తగ్గడం వలన ఓవరాల్ గా సినిమా…
ఈ రోజు ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే 2 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా షేర్ ని తెలుగు రాష్ట్రాలలో అందుకునే అవకాశం ఉంది, ఇక హిందీలో సినిమా ఈ రోజు 1.6-2 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా…
ఓవరాల్ గా ఈ రోజు వరల్డ్ వైడ్ గా అటూ ఇటూగా 3.2-3.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా ఈవినింగ్ అండ్ నైట్ షోలకు సినిమా కొంచం గ్రోత్ ని చూపించగలిగితే షేర్ ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. ఇక డే ఎండ్ అయ్యే టైంకి సినిమా ఎలా హోల్డ్ చేస్తుందో చూడాలి.