టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ గాడ్ ఫాదర్ రెండో వీక్ లో ఎంటర్ అవ్వగా సినిమా కి రెండో వీక్ లో కూడా వర్షాల వలన ఇబ్బందులు తలెత్తగా కొత్త సినిమాల రిలీజ్ ల వలన థియేటర్స్ తగ్గాయి. ఉన్నంతలో 10వ రోజు కొంచం గ్రోత్ చూపించినా నైట్ షోల టైం కి హెవీ వర్షాల వలన ఎదురుదెబ్బ పడి కలెక్షన్స్ తగ్గాయి. ఇక ఇప్పుడు 11వ రోజు శనివారం అవ్వడంతో…
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద 10వ రోజు మీద 10-15% రేంజ్ లో గ్రోత్ ని అయితే చూపించింది అని చెప్పాలి. కొన్ని సెంటర్స్ లో ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ కూడా బాగానే ఉండటంతో ఈ రోజు…
సినిమా తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద ఇప్పుడు 50 లక్షల రేంజ్ లో షేర్ ని అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే సొంతం చేసుకునే అవకాశం ఉండగా వరల్డ్ వైడ్ గా సినిమా 65 లక్షల నుండి 70 లక్షల రేంజ్ లో…
షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి. అన్ని చోట్లా నైట్ షోలకు వర్షాల వలన ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండి ఫైనల్ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే ఈ కలెక్షన్స్ ఇంకొంచం పెరిగే అవకాశం ఉంది, ఇక 11 రోజుల టోటల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.