మొదటి వీక్ లోనే బ్రేక్ ఈవెన్ ని దాటేసి మంచి లాభాల బాట పట్టిన నాచురల్ స్టార్ నాని(Nani) నటించిన లేటెస్ట్ మూవీ హిట్3(Hit 3 Movie) సినిమా, IPL మ్యాచులు పోస్ట్ పోన్ అవ్వడం కలిసి రావడంతో వీకెండ్ లో అనుకున్న దాని కన్నా కూడా బెటర్ గానే ట్రెండ్ ను చూపెడుతూ దుమ్ము లేపుతూ ఉండటం విశేషం.
బాక్స్ ఆఫీస్ దగ్గర 10వ రోజున అనుకున్న దాని కన్నా బెటర్ గా ట్రెండ్ ను చూపించిన సినిమా ఇప్పుడు 11వ రోజున సండే అడ్వాంటేజ్ తో అన్ని చోట్లా మరోసారి మాస్ రచ్చ చేస్తూ లాభాలను మరింతగా పెంచుకుంటూ ఉండగా ఆల్ మోస్ట్ ట్రాక్ చేసిన సెంటర్స్ లో…
డే 10 రేంజ్ లోనే ఓపెన్ అవ్వగా తర్వాత ఈవినింగ్ షోలకు కొంచం గ్రోత్ కూడా కనిపించగా, ఈ ఇంపాక్ట్ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లో కూడా స్టడీగా ఉండే అవకాశం ఎంతైనా ఉండగా… మొత్తం మీద సినిమా 11వ రోజున తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు 1.4-1.5 కోట్ల రేంజ్ లో షేర్ ని…
అందుకునే అవకాశం ఉండగా, ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కనుక బాగుంటే ఈ లెక్క మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఇక సినిమా వరల్డ్ వైడ్ గా కూడా మంచి ట్రెండ్ ను చూపెడుతున్న సినిమా ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా కూడా ఈ రోజున….
1.8 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా షేర్ ని అందుకునే అవకాశం ఉండగా, ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు అంచనాలను మించిపోతే ఈ లెక్క మరింతగా పెరిగే అవకాశం ఎంతైనా ఉంది. ఇక టోటల్ గా సినిమా 11 రోజులకు గాను సాధించే ఏరియాల వారి కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.