బాక్స్ ఆఫీస్ దగ్గర దసరా మూవీస్ రెండో వీకెండ్ లో ఎంటర్ అవ్వగా అన్ని సినిమాలు రెండో శనివారం ఉన్నంతలో మంచి కలెక్షన్స్ ని అందుకోగా ఇప్పుడు ఇప్పుడు రెండో సండేలోకి ఎంటర్ అయిన సినిమాలు వేటి రేంజ్ లో అవి పర్వాలేదు అనిపించేలా పెర్ఫార్మెన్స్ ను చూపెడుతూ ఉన్నాయి….
టైగర్ నాగేశ్వరరావు(Tiger Nageswara Rao) సినిమా మొత్తం మీద మరోసారి 9వ రోజుకి సిమిలర్ గానే ట్రెండ్ అవుతూ ఉండగా కొన్ని చోట్ల ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లో గ్రోత్ కనిపిస్తూ ఉండటంతో ఈ రోజు సినిమా 75 లక్షల రేంజ్ నుండి అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే 85 లక్షల దాకా షేర్ ని అందుకోవచ్చు.
ఇక లియో(LEO Movie) మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో మరోసారి గ్రోత్ ని చూపించగా 60 లక్షల నుండి 70 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవాకాశం ఉందని చెప్పాలి. ఇక భగవంత్ కేసరి(Bhagavanth Kesari) సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 11 వ రోజు మంచి జోరుని చూపిస్తూ ఉండగా…
సినిమా ఈ రోజు 1.7 కోట్ల నుండి 1.8 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు అంచనాలు మించిపోతే 2 కోట్ల కి అటూ ఇటూగా షేర్ ని అందుకోవచ్చు. ఇక లియో వరల్డ్ వైడ్ గా 16-18 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉంది.
ఇక భగవంత్ కేసరి వరల్డ్ వైడ్ గా 2.3 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఓవరాల్ గా అన్ని సినిమాలు వేటి రేంజ్ లో అవి మంచి కలెక్షన్స్ తో హోల్డ్ చేయగా అన్ని సినిమాల అఫీషియల్ కలెక్షన్స్ ఇదే రేంజ్ లో ఉంటాయా లేక కొంచం అటూ ఇటూగా ఉంటాయో చూడాలి ఇక…