బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ తో మాస్ రచ్చ చేస్తున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన ఊరమాస్ మూవీ పుష్ప2(Pushpa 2 The Rule) మూవీ…సెన్సేషనల్ కలెక్షన్స్ తో రెండో వీకెండ్ లో వీర విహారం చేస్తూ దూసుకు పోతుంది… 10వ రోజున అన్ని చోట్లా సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న పుష్ప2 సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర….
11వ రోజు సండే అడ్వాంటేజ్ తో అంచనాలను మించే రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ దూసుకు పోతుంది. తెలుగు రాష్ట్రాల్లో సినిమా 10వ రోజు మీద బెటర్ గా ట్రెండ్ అవుతూ ఉండగా 8 కోట్లకు పైగానే షేర్ ని ఈ రోజు సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి…
ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే షేర్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇక సినిమా కర్ణాటక మరియు తమిళ్ లో మాస్ రచ్చ చేస్తూ ఉండగా కేరళలో మాత్రం పెద్దగా ఇంపాక్ట్ ను చూపించలేక పోతుంది. అయినా కూడా ఈ మూడు ఏరియాల్లో సినిమా మరోసారి 4.8-5 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉంది…
ఇక సినిమా హిందీ లో చూపిస్తున్న జోరు ముందు మిగిలిన ఇండస్ట్రీ ల కలెక్షన్స్ చాలా తక్కువగా కనిపిస్తూ ఉండగా హిందీ లో ఈ రోజు మాస్ ఊచకోత కోస్తూ 53-55 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉండగా ఫైనల్ లెక్కలు బాగుంటే ఈ లెక్క ఇంకా పెరిగే అవకాశం ఉంది…
ఇక ఓవర్సీస్ లో కూడా 1 మిలియన్ రేంజ్ లో వసూళ్ళని అందుకోబోతున్న పుష్ప2 మూవీ వరల్డ్ వైడ్ గా ఇప్పుడు 11వ రోజున ఓవరాల్ గా 42-44 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు….అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే…
ఈ షేర్ లెక్క ఇంకా పెరిగే అవకాశం ఉంది. సినిమా హిందీలో చూపించే ఫైనల్ కలెక్షన్స్ ని బట్టి కలెక్షన్స్ ఇంకా జోరు పెరిగే అవకాశం ఉందని చెప్పాలి. మొత్తం మీద 11వ రోజు వరల్డ్ వైడ్ గా పుష్ప2 మూవీ ఎలాంటి కలెక్షన్స్ తో మాస్ ఊచకోత కోస్తుందో చూడాలి ఇప్పుడు…