బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహకందని రికార్డులతో ఊచకోత కోస్తూ దూసుకు పోతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన సెన్సేషనల్ మూవీ పుష్ప2 ది రూల్(Pushpa 2 The Rule Movie) రెండో వీకెండ్ లో అన్ని చోట్లా ఊహకందని కలెక్షన్స్ తో రికార్డుల భీభత్సం సృష్టిస్తూ దూసుకు పోతుంది. సినిమా 10వ రోజు అనుకున్న అంచనాలను అన్నీ కూడా మించి పోయింది..
ఇక సినిమా 11వ రోజున సండే అడ్వాంటేజ్ తో ఊహకందని కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ చరిత్ర సృష్టించడానికి సిద్ధం అవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ఓపెనింగ్స్ కుమ్మేస్తున్నా కూడా హిందీలో సినిమా చూపిస్తున్న జోరు ముందు తెలుగు కలెక్షన్స్ లెక్క చాలా చిన్నగా మారిపోయింది ఇప్పుడు…
మొత్తం మీద 11వ రోజు సినిమా ఓపెన్ అయిన తీరు చూస్తుంటే తెలుగు రాష్ట్రాల్లో మరోసారి 10వ రోజుకి సిమిలర్ గా షేర్ ని అందుకోవడం ఖాయంగా కనిపిస్తూ ఉండగా ఫైనల్ లెక్కలు బాగుంటే 8 కోట్లకి పైగా షేర్ ని అందుకునే అవకాశం ఉంది. ఇక కర్ణాటక తమిళ్ అండ్ కేరళ కలిపి మరోసారి…
సినిమా 6 కోట్లకు పైగానే షేర్ ని అందుకునే అవకాశం ఉండగా హిందీ లో సినిమా ఈ రోజు మరోసారి మాస్ భీభత్సం సృష్టిస్తూ ఉండగా అవలీలగా 50 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ ని మినిమమ్ వసూల్ చేసే అవకాశం ఉండగా ఈవినింగ్ అండ్ నైట్ షోల ట్రెండ్ ను బట్టి…
ఈ లెక్క ఇంకా పెరిగే అవకాశం ఎంతైనా ఉంది…ఇక ఓవర్సీస్ లో కూడా మంచి జోరు చూపిస్తున్న సినిమా మొత్తం మీద 11వ రోజు రికార్డుల భీభత్సం సృష్టించడం ఖాయమని చెప్పాలి. వరల్డ్ వైడ్ షేర్ 42-45 కోట్ల రేంజ్ లో ఉండటం ఖాయంగా కనిపిస్తూ ఉండగా డే ఎండ్ వరకు సినిమా గ్రోత్ ని బట్టి ఈ లెక్కని ఎంతవరకు మించుతుందో చూడాలి ఇప్పుడు.