బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ దూసుకు పోతూ రెండో వీకెండ్ ని పూర్తి చేసుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన సెన్సేషనల్ మూవీ పుష్ప2(Pushpa2 Movie) హిందీలో చూపిస్తున్న మాస్ జోరు ముందు తెలుగు రాష్ట్రాల జోరు చిన్నగా కనిపిస్తున్నా కూడా 11వ రోజు తెలుగు రాష్ట్రాల్లో సండే అడ్వాంటేజ్ తో అనుకున్న…
అంచనాలను అన్నీ కూడా మించి పోయి మాస్ రచ్చ చేయడం విశేషం…సినిమా ముందు అనుకున్న అంచనాలను అన్నీ కూడా మించి పోయింది 10 కోట్ల మార్క్ ని అందుకోవచ్చు అనుకుంటే …ఆ మార్క్ ని సైతం మించి పోయి సెకెండ్ షోలకు కూడా ఎక్స్ లెంట్ ఆక్యుపెన్సీతో దుమ్ము లేపి…
ఏకంగా 12.35 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుని ఊహకందని ఇండస్ట్రీ రికార్డ్ ను 11వ రోజున సొంతం చేసుకుంది ఇప్పుడు. ఇది వరకు 11వ రోజున తెలుగు రాష్ట్రాల్లో ప్రభాస్(Prabhas) నటించిన బ్లాక్ బస్టర్ కల్కి(Kalki 2898AD) సినిమా 10.01 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుని…
రికార్డ్ ను సృష్టించగా….ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర 11వ రోజున ఈ రికార్డ్ ను బ్రేక్ చేసిన పుష్ప2 మూవీ ఏకంగా 12.35 కోట్లతో కొత్త రికార్డ్ ను నమోదు చేసింది. 11వ రోజు టాలీవుడ్ లో 10 కోట్లకు పైగా షేర్ ని అందుకున్న 2 సినిమాలు ఇవే అవ్వడం విశేషం అని చెప్పాలి…ఇక ఓవరాల్ గా ఇప్పుడు….
11 వ రోజున ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమాలను గమనిస్తే…
11th Day All Time Highest Share movies in Telugu States
👉#Pushpa2TheRule – 12.25CR*******
👉#KALKI2898AD – 10.01CR
👉#SALAAR – 8.28Cr
👉#Baahubali2 – 6.80Cr
👉#RRRMovie – 4.98CR
👉#Baahubali – 3.76Cr
👉#HanuMan- 3.34Cr
👉#Jailer(Dub) – 3.28Cr
👉#Maharshi: 3.22Cr
👉#KGFChapter2(Dub) – 3.16Cr
👉#Akhanda: 3.08Cr
👉#Syeraa-2.73Cr
👉#Devara Part 1 – 2.54Cr
👉#AlaVaikunthapurramuloo- 2.52Cr
మొత్తం మీద ఫెంటాస్టిక్ కలెక్షన్స్ తో పుష్ప2 మూవీ ఇక్కడ మాస్ రికార్డ్ ను నమోదు చేసింది. ఇక లాంగ్ రన్ లో సినిమా ఇంకా ఎలాంటి కలెక్షన్స్ తో జోరు చూపిస్తుందో అన్నది ఆసక్తిగా మారగా అప్ కమింగ్ టైంలో వచ్చే మూవీస్ లో పుష్ప2 డే 11 ఇండస్ట్రీ రికార్డ్ ను ఏ సినిమా బ్రేక్ చేస్తుందో చూడాలి.