బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా హైప్ లేకుండా మొదటి ఆటకే మిక్సుడ్ టాక్ ను సొంతం చేసుకున్నా కూడా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో రెండో వీక్ లో కూడా హౌస్ ఫుల్ బోర్డులతో మాస్ రచ్చ చేయడం మామూలు విషయం కాదు….ఇలాంటి సెన్సేషన్ ని సృష్టిస్తున్న కోలివుడ్ టాప్ హీరో దళపతి విజయ్(Thalapathy Vijay) నటించిన లేటెస్ట్ మూవీ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం(G.O.A.T Movie)సినిమా…
రెండో వీకెండ్ లో మాస్ రచ్చ చేస్తూ దూసుకు పోతూ ఉండగా తెలుగు రాష్ట్రాల్లో మాత్రం స్లో అయినా కూడా మొత్తం మీద తెలుగు లో మరోసారి 10 లక్షల రేంజ్ కి అటూ ఇటూగా షేర్ ని అందుకునే అవకాశం ఉండగా తమిళనాడులో మాత్రం సినిమా…
ఎక్స్ లెంట్ గా జోరు చూపెడుతూ దూసుకు పోతూ ఉండగా సినిమా 12-13 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని గ్రాస్ లో అందుకునే అవకాశం ఉంది, ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే ఇంకా జోరు పెంచే అవకాశం ఉంది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు…
ఓవర్సీస్ లో కూడా మరోసైర్ మంచి జోరు చూపించే అవకాశం ఉండటంతో సినిమా 11వ రోజు వరల్డ్ వైడ్ గా 16-18 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను మరోసారి అందుకునే అవకాశం ఎంతైనా ఉంది, ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి ఈ కలెక్షన్స్ కొంచం అటూ ఇటూగా…
ఉండే అవకాశం ఉండగా మిక్సుడ్ టాక్ తో కూడా ఈ రేంజ్ లో హోల్డ్ ని చూపెడుతూ ఉండటం విశేషం, తమిళనాడులో ఊరమాస్ హోల్డ్ ని చూపిస్తున్న సినిమా సాలిడ్ లాభాలను ఇక్కడ పెంచుకునే అవకాశం ఎంతైనా ఉంది. ఇక టోటల్ గా సినిమా 11 రోజుల్లో సాధించే కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి ఇక..