అల్టిమేట్ కలెక్షన్స్ 10వ రోజున అనుకున్న అంచనాలను అన్నీ కూడా మించి పోయిన పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas)నటించిన కల్కి 2898AD(Kalki2898AD Movie)మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు 11వ రోజులో ఎంటర్ అవ్వగా అన్ని చోట్లా సినిమా అద్బుతమైన హోల్డ్ తో దుమ్ము లేపుతూ దూసుకు పోతూ ఉండటం విశేషం…
సినిమా తెలుగు కలెక్షన్స్ కొంచం టికెట్ హైక్స్ తగ్గిన తర్వాత స్లో అవ్వగా హిందీ కలెక్షన్స్ లో మాత్రం ఎక్స్ లెంట్ ట్రెండ్ కనిపిస్తూ అన్ని చోట్ల కలెక్షన్స్ లోకి ఇప్పుడు సూపర్ లీడ్ ను చూపెడుతూ ప్రభాస్ మాస్ పవర్ తో రచ్చ చేస్తుంది… ఇక తెలుగు రాష్ట్రాల్లో సినిమా 11వ రోజున మరోసారి మాస్ రచ్చ…
చేస్తూ ఉండగా ఆల్ మోస్ట్ డే 10 కి సిమిలర్ గానే ట్రెండ్ ను చూపెడుతూ ఉన్న సినిమా అన్ని చోట్ల ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ పరంగా కూడా మంచి జోరుని చూపిస్తూ ఉండగా సినిమా 6-6.5 కోట్ల రేంజ్ లో ఉండే అవకాశం ఉంది, ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లో గ్రోత్ ఉంటే షేర్ ఇంకా పెరిగే అవకాశం ఉంది.
ఇక హిందీలో 11వ రోజు మరింతగా జోరు చూపిస్తున్న సినిమా ఆల్ మోస్ట్ 18-19 కోట్లకు తగ్గని నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా ఫైనల్ లెక్కలు బాగుంటే 20 కోట్ల మార్క్ దాటేసి ఇంకా ఎక్కువ వసూళ్ళనే అందుకోవచ్చు…
ఇక కర్ణాటక, తమిళ్ మరియు కేరళలో కూడా 10వ రోజు లెవల్ కి తగ్గకుండా కుమ్మేస్తున్న సినిమా 4.5-5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా ఓవర్సీస్ లో సినిమా మరోసారి కుమ్మేస్తూ 3 కోట్లకి పైగానే షేర్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉంది…
దాంతో ఇప్పుడు 11వ రోజున వరల్డ్ వైడ్ గా కల్కి మూవీ 22-23 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా ఫైనల్ లెక్కలు బాగుంటే షేర్ ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది…. 11వ రోజు ఈ రేంజ్ వసూళ్లు అంటే మామూలు విషయం కాదు. ఇక టోటల్ గా సినిమా 11 రోజుల కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి ఇప్పుడు.