లాస్ట్ ఇయర్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ లాంగ్ రన్ ను సొంతం చేసుకుని సూపర్ హిట్ అయిన సినిమాలు కొన్ని ఉండగా…మొదటి రోజే ఎక్స్ ట్రీమ్ లెవల్ లో మిక్సుడ్ టాక్ ను సొంతం చేసుకోవడంతో ఇక తేరుకోవడం కష్టమే అని అందరూ అనుకున్నా కూడా ఎక్స్ లెంట్ లాంగ్ రన్ ను థియేటర్స్ లో సొంతం చేసుకుని…
సూపర్ డూపర్ హిట్ గా నిలిచిన మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన బ్లాక్ బస్టర్ దేవర(Devara Part 1) ఎపిక్ లాంగ్ రన్ ను సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసింది. తొలిరోజు వచ్చిన టాక్ కి లాంగ్ రన్ లో ఎవ్వరూ ఊహించని రేంజ్ లో…
450 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకున్న సినిమా తర్వాత 50 రోజులు 100 రోజులను కూడా పూర్తి చేసుకుని కుమ్మేసింది….ఇక సినిమా బాక్స్ ఆఫీస్ రన్ ను పూర్తి చేసుకున్న తర్వాత నెట్ ఫ్లిక్స్ లో డిజిటల్ రిలీజ్ అవ్వగా అక్కడ కూడా మొదట్లో అనుకున్న రేంజ్ లో…
వ్యూవర్ షిప్ రాకపోవడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాగోలా హిట్ అయింది కానీ డిజిటల్ లో సినిమాకి దెబ్బ పడింది అని అందరూ అనుకున్నారు…కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర మిక్సుడ్ టాక్ తో ఏ రేంజ్ లో కుమ్మేసి లాంగ్ రన్ ను ఎంజాయ్ చేసిందో….డిజిటల్ లో కూడా ఇప్పుడు…
అదే రేంజ్ లో సాలిడ్ గా ట్రెండ్ అవుతూ వారం వారం కొత్త సినిమాలు వస్తూ ఉన్నప్పటికీ కూడా ట్రెండ్ అవ్వడం మాత్రం ఆగలేదు…ఏకంగా 11 వారాలు నాన్ స్టాప్ గా టాప్ 10 లో ఒకటిగా అనేక దేశాల్లో కూడా ట్రెండ్ అవుతూ మాస్ రచ్చ చేస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి..
ఓవరాల్ గా సినిమా రన్ ఒక అద్బుతం అనే చెప్పాలి. మొదట్లో అంచనాలను అందుకోలేక పోవచ్చు అనుకున్నా కూడా అంచనాలను మించి అందరికీ చుక్కలు చూయించిన దేవర మూవీ ఇప్పటికీ డిజిటల్ లో సాలిడ్ ట్రెండ్ ను చూపెడుతూ దుమ్ము లేపుతూ ఉండటం విశేషం…