8 నెలల తర్వాత థియేటర్స్ రీ ఓపెన్ అయినా కానీ కొన్ని సినిమాలు ఇప్పటికీ డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ కే మొగ్గు చూపుతున్నాయి. ఇలాంటి టైం లో యూత్ లో మంచి క్రేజ్ ని సొంతం చేసుకున్న డర్టీ హరి సినిమా థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది అనుకుంటే సినిమాను అలా రిలీజ్ చేయకుండా డైరెక్ట్ రిలీజ్ లో మరో పద్దతి అయిన పే పెర్ వ్యూ పద్దతిలో కొత్త యాప్ ని లాంచ్ చేసి సినిమాను అందులో రిలీజ్….
చేయబోతున్నాం అంటూ అనౌన్స్ చేశారు సినిమా యూనిట్ వాళ్ళు… దాంతో సినిమా ఆ యాప్ లోనే చూడటానికి ఆడియన్స్ బాగానే ఉత్సాహం చూపారు కానీ మేకర్స్ సరైన విధంగా అరేంజ్ మెంట్స్ అయితే చేయలేదు. సినిమా కి ఒక్కో టికెట్ 120 గా ఫిక్స్ చేశారు సినిమా యూనిట్ వాళ్ళు.
కాగా మొదటి రోజు కి గాను సినిమా ను చూడటానికి భారీ సంఖ్యలో జనాలు టికెట్స్ కొనగా సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా చూడటానికి సిద్ధం అయితే సైట్ ఓపెన్ కాక పోవడం తో ఆడియన్స్ చిరాకు పడటం స్టార్ట్ చేశారు… ఎంతమంది ఒకే సారి చూడటం మొదలు పెట్టారో తెలియదు కానీ…
దెబ్బ కి సర్వర్లు హాంగ్ అవ్వడం మొదలు అయ్యిందట. దాంతో సాయంత్రం 6 కి సినిమా రిలీజ్ అయినా కానీ మొదటి బ్యాచ్ సినిమా చూడటం మొదలు పెట్టింది మాత్రం అర్ధరాత్రి అయ్యే టైం కి అని చెప్పాలి. సర్వర్లు హ్యాంగ్ అవ్వడం తో కొద్ది సేపట్లో క్లియర్ చేస్తాం అంటూ అప్ డేట్ చేసినా కానీ అలా అలా డిలే అవుతూ ఆ రోజు మొత్తం గడిచిన తర్వాత కానీ పరిస్థితి నార్మల్ అవ్వలేదు…
సర్వర్లు ఇలాంటి స్ట్రీమింగ్ కోసం అయితే నార్మల్ గా చాలా పెద్ద రేట్లు చెల్లించి సర్వర్స్ ని సెట్ చేస్తారు… రీసెంట్ గా రిలీజ్ అయిన ఏ సినిమా కి కూడా రాని ఇబ్బంది ఈ సినిమాకి వచ్చింది… అంటే సర్వర్స్ లో నాసిరకం లేదా తక్కువ రేటు ఉన్నవి తీసుకోవడం వలన జరిగింది అని తెలుస్తుంది, దాంతో కొంచం ఆలస్యం చేసి సర్వర్లు చేంజ్ చేశాక పరిస్థితి సద్దుకుందని సమాచారం.