నాచురల్ స్టార్ నాని(Nani) నటించిన లేటెస్ట్ మూవీ హిట్3(Hit 3 Movie) సినిమా ఈ సమ్మర్ లో టాలీవుడ్ తరుపున హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని మంచి విజయాన్ని సొంతం చేసుకున్న సినిమాగా నిలవగా నాని కెరీర్ లో ఆల్ టైం హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమాగా కూడా నిలిచి కుమ్మేసింది..
త్వరలో సినిమా డిజిటల్ లో రిలీజ్ కి సిద్ధం అయినా కూడా లిమిటెడ్ థియేటర్స్ లో పర్వాలేదు అనిపించేలా షేర్స్ ని నాలుగో వీకెండ్ లో కూడా సొంతం చేసుకుంటూ దూసుకు పోతున్న హిట్3 మూవీ ఇప్పుడు నాని కెరీర్ లో మరో మైలురాయిని సొంతం చేసుకుని కుమ్మేసింది.
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 24 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో వరల్డ్ వైడ్ గా 120 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకుని సంచలనం సృష్టించింది. నాని కెరీర్ లో ఆల్ టైం హైయెస్ట్ గ్రాస్ మార్క్ ని అందుకోవడమే కాకుండా ఇప్పుడు సరికొత్త బెంచ్ మార్క్ ని…
గ్రాస్ పరంగా సొంతం చేసుకుని సాలిడ్ బెంచ్ మార్క్ ని అందుకోవడం విశేషమని చెప్పాలి. లాస్ట్ 4 సినిమాల్లో మూడు సార్లు 100 కోట్ల గ్రాస్ మార్క్ ని దాటేసి సంచలనం సృష్టించిన నాని దసరా తో 115 కోట్ల మార్క్ ని అందుకుంటే ఇప్పుడు హిట్3 లాంటి ఏ సర్టిఫికేట్ తెచ్చుకున్న…
వైలెంట్ మూవీ తో బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ మరీ అనుకున్న రేంజ్ లో లేక పోయినా కూడా తెలుగు రాష్ట్రాల ఆవల మంచి జోరుని చూపించగా తెలుగు రాష్ట్రాల్లో దసరా రేంజ్ లో కాకపోయినా పర్వాలేదు అనిపించేలా హోల్డ్ చేసి బ్రేక్ ఈవెన్ ని దాటేసి..
ఇప్పుడు వరల్డ్ వైడ్ గా 120 కోట్ల మార్క్ ని దాటేసింది. సినిమా ఇక వీకెండ్ తర్వాత రన్ ఆల్ మోస్ట్ స్లో డౌన్ కాబోతూ ఉండగా షేర్ పరంగా దసరాని దాటాలి అంటే ఇంకొంచం కష్టపడాల్సిన అవసరం ఉంది. మరి మిగిలిన రన్ లో షేర్ పరంగా రికార్డ్ ను అందుకుంటుందో లేదో చూడాలి.