ప్రీ కోవిడ్ టైంలో కెరీర్ బెస్ట్ ఫామ్ లో దుమ్ము లేపిన ఖిలాడి అక్షయ్ కుమార్(Akshay Kumar) కోవిడ్ తర్వాత తన సినిమాల పరిస్థితి దారుణంగా మారిపోయింది. ఒకటి తర్వాత ఒకటి సినిమాలు రిలీజ్ అవ్వడం బాక్స్ ఆఫీస్ దగ్గర అట్టర్ ఫ్లాఫ్ రిజల్ట్ లను సొంతం చేసుకుంటూ ఉండటంతో ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాడు అక్షయ్ కుమార్…
తను నటించిన లేటెస్ట్ మూవీ ఖేల్ ఖేల్ మే(Khel Khel Mein Movie) ఆడియన్స్ ముందుకు ఈ ఆగస్టు 15 వీకెండ్ లో రిలీజ్ అవ్వగా పోటిలో ఉన్న మమ్మోత్ బ్లాక్ బస్టర్ స్త్రీ2 దెబ్బకి ఈ సినిమా మినిమమ్ ఇంపాక్ట్ ను కూడా చూపించ లేక పోయింది….ఓపెనింగ్స్ నుండే డిసాస్టర్ కలెక్షన్స్ ని…
అందుకున్న ఈ సినిమా తర్వాత ఏ దశలో కూడా తిరిగి తేరుకోలేక పోయింది….మొత్తం మీద ఈ సినిమా 6 రోజుల్లో 17.50 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని మాత్రమే అందుకోగా అందులో నుండి షేర్ కేవలం 8 కోట్ల రేంజ్ లోనే ఉంటుందని అంచనా…ఈ సినిమా ఒరిజినల్ వర్షన్..
2016 టైంలో ఇటాలియన్ భాషలో తెరకెక్కిన పర్ఫెక్ట్ స్ట్రేంజర్స్ అనే సినిమా రీమేక్ గా రాగా ఒరిజినల్ మంచి విజయాన్ని అందుకోవడంతో రీమేక్ కూడా వర్కౌట్ అవుతుంది అనుకున్నా అలాంటిది ఏమి జరగలేదు. ఈ సినిమా కోసం ఆల్ మోస్ట్ పబ్లిసిటీ ఖర్చులతో కలిపి 120 కోట్ల రేంజ్ లో…
బడ్జెట్ ని పెట్టగా బాక్స్ ఆఫీస్ రికవరీ మాత్రం కనీసం 10% కూడా లేకపోవడం సినిమా ఏ రేంజ్ లో నిరాశ పరిచిందో అన్నదానికి నిదర్శనం అని చెప్పాలి. సినిమాకి కొంచం పర్వాలేదు అనిపించే రెస్పాన్స్ ఆడియన్స్ నుండి వచ్చినా కూడా అసలు జనాలు ఎందుకో…
అక్షయ్ కుమార్ కొత్త సినిమాలను థియేటర్స్ లో చూడటానికి ఏమాత్రం ఆసక్తిని అయితే చూపించడం లేదు. దాంతో ఆ ఇంపాక్ట్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ పై క్లియర్ గా కనిపిస్తూ ఉండగా లాంగ్ రన్ లో కూడా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తేరుకునే అవకాశం చాలా తక్కువగానే ఉందని చెప్పాలి ఇప్పుడు.