ఈ ఇయర్ ఆగస్టు 14న ఈ ఇయర్ వన్ ఆఫ్ ది మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో ఒకటైన టాలీవుడ్ మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(Jr NTR) బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్(Hrithik Roshan) ల క్రేజీ కాంబోలో భారీ హైప్ నడుమ రూపొందుతున్న వార్2(War2 Movie) సినిమా గ్రాండ్ గా రిలీజ్ కి సిద్ధం అవుతూ ఉండగా…
రీసెంట్ గా ఎన్టీఆర్ పుట్టిన రోజు టైంలో సినిమా అఫీషియల్ టీసర్ ను రిలీజ్ చేశారు…టీసర్ పర్వాలేదు అనిపించే విధంగా ఉన్నప్పటికీ కూడా 24 గంటల్లో అనుకున్న రేంజ్ లో రెస్పాన్స్ ను అయితే టీసర్ సొంతం చేసుకోలేదు. తెలుగు లో ఎన్టీఆర్ కి ఉన్న క్రేజ్ పవర్ తో కంపేర్ చేస్తే…
మొదటి 24 గంటల రెస్పాన్స్ అనుకున్న రేంజ్ లో రాలేదు….దాంతో సోషల్ మీడియాలో సాలిడ్ గా ట్రోల్స్ ను సొంతం చేసుకున్న ఈ టీసర్ తోనే ఇప్పుడు ఎన్టీఆర్ మాస్ రికార్డ్ ను సృష్టించాడు. తెలుగు లో డబ్ అయిన మూవీస్ టీసర్ లలో ఆల్ టైం ఎపిక్ రికార్డ్ ను..
సొంతం చేసుకుని మాస్ రచ్చ చేశాడు. వార్2 తెలుగు టీసర్ యూట్యూబ్ లో నాన్ స్టాప్ గా 5 రోజులకు పైగా ట్రెండ్ అయ్యి సంచలనం సృష్టించింది ఇప్పుడు. రిలీజ్ రోజున మధ్యాహ్నం 2 గంటల టైం నుండి టాప్ ప్లేస్ లో ట్రెండ్ అవ్వడం మొదలు పెట్టిన ఈ టీసర్…
మే 25 సాయంత్రం 8.30 గంటల టైం వరకు టాప్ ప్లేస్ లో అలానే ట్రెండ్ అయ్యింది. దాంతో ఆల్ మోస్ట్ 126 గంటల పాటు నాన్ స్టాప్ గా టాప్ ప్లేస్ లో ట్రెండ్ అయ్యి సంచలనం సృష్టించిన ఈ టీసర్ మొదటి రోజు వీక్ రెస్పాన్స్ అని ట్రోల్ అయినా ఇప్పుడు…
ఏకంగా 126 గంటల పాటు ట్రెండ్ అయ్యి టాలీవుడ్ మూవీస్ లో అత్యధిక టైం యూట్యూబ్ లో టాప్ ప్లేస్ లో ట్రెండ్ అయిన మూవీస్ వన్ ఆఫ్ ది హైయెస్ట్ ప్లేస్ లో ఎంటర్ అయ్యి సంచలనం సృష్టించింది. సినిమా మీద అంచనాలు సాలిడ్ గా పెరుగుతూ ఉండగా ఇక మీదట వచ్చే ప్రమోషనల్ కంటెంట్ ఎలా ఉంటుందో చూడాలి.