రెండో వీకెండ్ లో ఓవరాల్ గా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని మంచి ట్రెండ్ ను చూపెడుతూ లాభాలను పెంచుకున్న నాచురల్ స్టార్ నాని(Nani) నటించిన లేటెస్ట్ మూవీ హిట్3(Hit 3 Movie) సినిమా రెండో వీక్ వర్కింగ్ డేస్ లో అడుగు పెట్టగా 12వ రోజున సినిమా అనుకున్న దాని కన్నా బెటర్ గా హోల్డ్ చేసింది..
టికెట్ హైక్స్ ని తగ్గించడం, IPL మ్యాచులు ఏమి లేక పోవడంతో ఆడియన్స్ కి సినిమాలే ఆప్షన్ అవ్వగా వర్కింగ్ డే లో అనుకున్న దాని కన్నా బెటర్ గా హోల్డ్ ని చూపిస్తూ 15 వేలకు పైగా టికెట్ సేల్స్ తో హిట్3 మూవీ 12వ రోజున మంచి జోరుని చూపించడం విశేషం.
సినిమా 30-35 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చు అనుకున్నా నైట్ షోలకు మంచి ట్రెండ్ నే చూపించిన సినిమా ఏకంగా 50 లక్షల మార్క్ ని దాటేసి 53 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకుంది. ఇక వరల్డ్ వైడ్ గా 72 లక్షల షేర్ ని అందుకోగా 1.35 కోట్ల గ్రాస్ ను అందుకుంది.
దాంతో టోటల్ వరల్డ్ వైడ్ గా 12 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Nani Hit3 Movie 12 Days Total WW Collections Report(Inc Gst)
👉Nizam: 17.48Cr
👉Ceeded: 4.89Cr
👉UA: 4.90Cr
👉East: 2.69Cr
👉West: 2.15Cr
👉Guntur: 2.72Cr
👉Krishna: 2.44Cr
👉Nellore: 1.26Cr
AP-TG Total:- 38.53CR(67.50CR~ Gross)
👉KA+ROI – 6.72Cr
👉Other Languages – 1.92Cr~
👉OS – 12.30Cr~….Approx
Total World Wide – 59.47CR (112.75CR~ Gross)
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో ఏకంగా 9.47 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ మార్క్ ని అందుకోగా మిగిలిన రన్ లో ఓవరాల్ గా లాభాలను మరింతగా పెంచుకునే అవకాశం ఎంతైనా ఉంది.