బాక్స్ ఆఫీస్ దగ్గర అన్ని చోట్లా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన సెన్సేషనల్ మూవీ పుష్ప2(Pushpa 2 The Rule) మూవీ చూపిస్తున్న జోరు ఒకెత్తు అయితే హిందీలో సినిమా హోల్డ్ చేస్తున్న తీరు మరో లెవల్ అని చెప్పాలి. హిందీలో సాధిస్తున్న మమ్మోత్ కలెక్షన్స్ తో హిస్టారికల్ లీడ్ ను ఇతర భాషల్లో…
చూపించే కలెక్షన్స్ మీద సొంతం చేసుకుంటూ దూసుకు పోతున్న పుష్ప2 మూవీ రెండో వీకెండ్ పూర్తి అయ్యే టైంకి రికార్డుల భీభత్సం సృష్టించగా రెండో వీకెండ్ తర్వాత వర్కింగ్ డేస్ లో అడుగు పెట్టిన సినిమా 12వ రోజు మరోసారి స్ట్రాంగ్ హోల్డ్ ని చూపించింది.
సినిమా మరోసారి 20 కోట్ల నెట్ కలెక్షన్స్ ని అందుకుని ఊచకోత కోసింది. రిలీజ్ అయిన రోజు నుండి 12 రోజుల పాటు నాన్ స్టాప్ గా సినిమా 20 కోట్లకి తగ్గని నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకుని మాస్ భీభత్సం సృష్టించింది ఇప్పుడు…12వ రోజున సినిమా 20.50 కోట్ల నెట్ కలెక్షన్స్ ని అందుకుంది.
ఒకసారి సినిమా మొత్తం మీద 12 రోజుల్లో హిందీలో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
#Pushpa2TheRule Hindi Day Wise Sensational Collections
👉Day 1 – 72CR
👉Day 2 – 59CR
👉Day 3 – 74CR
👉Day 4 – 86CR
👉Day 5 – 48CR
👉Day 6 – 36CR
👉Day 7 – 31.50CR
👉Day 8 – 27CR
👉Day 9 – 27.50CR
👉Day 10 – 46.50CR
👉Day 11 – 54CR
👉Day 12 – 20.50CR
Total Collections – 582.00CR NET💥💥💥💥
సినిమా రిమార్కబుల్ ట్రెండ్ ని చూపిస్తూ మాస్ రచ్చ చేయగా నాన్ స్టాప్ 12 రోజులు 20 కోట్లకు తగ్గని నెట్ కలెక్షన్స్ ని అందుకోవడం అంటే మామూలు భీభత్సం అనే చెప్పాలి. ఈ రేంజ్ రాంపెజ్ చూస్తుంటే లాంగ్ రన్ లో 750 కోట్ల రేంజ్ నెట్ కలెక్షన్స్ ని అందుకోవడం ఖాయమని చెప్పాలి ఇప్పుడు.