బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ తో మాస్ ఊచకోత కోస్తూ దూసుకు పోతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన సెన్సేషనల్ మూవీ పుష్ప2(Pushpa2 The Rule) రెండో వీకెండ్ లో కలెక్షన్స్ వీర విహారం చేసిన తర్వాత వర్కింగ్ డేస్ లో అడుగు పెట్టగా ఉన్నంతలో హిందీ కలెక్షన్స్ సాలిడ్ హెల్ప్ తో…
మరోసారి స్ట్రాంగ్ హోల్డ్ ని చూపించింది…కానీ తెలుగు తమిళ్ మరియు కర్ణాటకలో సినిమా అనుకున్న దాని కన్నా కూడా 12వ రోజున కొంచం ఎక్కువగానే డ్రాప్స్ ను సొంతం చేసుకోవడంతో ఓవరాల్ గా 12వ రోజున అనుకున్న అంచనాలను సినిమా మించి పోలేక పోయింది ఇప్పుడు…
మొత్తం మీద 12వ రోజున తెలుగు రాష్ట్రాల్లో 4 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చు అనుకున్నా కూడా సినిమా ఎక్కువగా డ్రాప్ అయ్యి 3.07 కోట్ల రేంజ్ లో షేర్ ని అయితే సొంతం చేసుకుంది ఇప్పుడు, అదే టైంలో తమిళ్ కర్ణాటకలో కూడా డ్రాప్స్ అనుకున్న దానికన్నా ఎక్కువగా వచ్చాయి…
కానీ హిందీ లో మాత్రం 20 కోట్ల కి తగ్గని నెట్ కలెక్షన్స్ ని అందుకుంటుంది అనుకుంటే అదే రేంజ్ లో జోరు చూపించగా వరల్డ్ వైడ్ గా సినిమా 12వ రోజున 15.52 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా 35.85 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకుంది ఇప్పుడు….
దాంతో సినిమా టోటల్ గా ఇప్పుడు 12 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Pushpa 2 The Rule 12 Days Total WW Collections(Inc GST)
👉Nizam: 88.54Cr
👉Ceeded: 29.19Cr
👉UA: 21.92Cr
👉East: 11.77Cr
👉West: 9.15Cr
👉Guntur: 14.39Cr
👉Krishna: 11.82Cr
👉Nellore: 7.12Cr
AP-TG Total:- 193.90CR(287.75CR~ Gross)
👉KA: 46.40Cr
👉Tamilnadu: 30.20Cr
👉Kerala: 7.30Cr
👉Hindi+ROI : 275.35Cr
👉OS – 101.85Cr***Approx
Total WW Collections : 655.00CR(Gross- 1,337.25CR~)
620 కోట్ల మమ్మోత్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగిన సినిమా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో ఏకంగా 35 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుంది. ఇక లాంగ్ రన్ లో సినిమా లాభాలను ఇంకా పెంచుకుని కుమ్మేసే అవకాశం అయితే ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.