12 వ రోజు కలెక్షన్స్…షాక్!

0
1297

      టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ అరవింద సమేత బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో వారం వర్కింగ్ డే టెస్ట్ ను సోమవారం ఎదురుకుంది. కాగా సినిమా మొత్తం మీద 11 రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డ్ లెవల్ లో 93.43 కోట్ల షేర్ ని వరల్డ్ వైడ్ గా 154 కోట్ల దాకా గ్రాస్ ని అందుకున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 12 వ రోజు మార్నింగ్ మ్యాట్నీ షోలకి అనుకున్న రేంజ్ లో ఓపెన్ కాలేదు.

వరుస సెలవుల తర్వాత వర్కింగ్ డే అవ్వడంతో ఈ డ్రాప్స్ కామన్ అనే చెప్పాలి. ఈవినింగ్ అండ్ నైట్ షోల కి ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుంది అన్న సందేహాలు కలిగినా  షాకింగ్ గా కొంత వరకు పుంజుకున్న సినిమా మొత్తం మీద రోజుని పర్వాలేదు అనిపించే విధంగా ముగించనుంది.

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 12 వ రోజు నైట్ షోల ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ ని పక్కకు పెడితే టోటల్ గా 80 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఒకవేళ జోరు బాగుంటే ఈ లెక్క మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.

ఇక రామ్ హెలొ గురు ప్రేమ కోసమే బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వర్కింగ్ డే టెస్ట్ లో పడుతూ లేస్తూ రోజుని ఒకే అనిపించుకునే లెవల్ లో ముగించింది. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 5 వ రోజున మొత్తం మీద సుమారు 1.5 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకోవచ్చు అని అంటున్నారు.

ఇక పందెం కోడి 2 మాస్ సెంటర్స్ లో కొంత స్టడీ గానే ఉన్నా మిగిలిన ఏరియాల్లో జోరు చూపలేదు. దాంతో ఓవరాల్ గా సినిమా 5 వ రోజును 50 లక్షల లోపే కలెక్షన్స్ ని అందుకునే ఛాన్స్ ఉందని అంటున్నారు. మరి మూడు సినిమాల అఫీషియల్ కలెక్షన్స్ వివరాలు ఎలా ఉంటాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here