బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ ఆదిపురుష్(AdiPurush) రెండో వీకెండ్ ని డీసెంట్ కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకుని ఇప్పుడు వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అయిన బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను అందుకోవడానికి ఇంకా కష్టపడాల్సిన అవసరం ఉదని.
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 11వ రోజుతో పోల్చితే ఇప్పుడు 12వ రోజు మరోసారి వర్కింగ్ డే ఇంపాక్ట్ వలన డ్రాప్స్ ను సొంతం చేసుకోగా ఆల్ మోస్ట్ ట్రాక్ చేసిన సెంటర్స్ లో 30% రేంజ్ లో డ్రాప్స్ ను సొంతం చేసుకుంది ఇప్పుడు. అలాగే హిందీలో కూడా సినిమా…
ఇదే రేంజ్ లో డ్రాప్స్ ను సొంతం చేసుకుందని చెప్పాలి. మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 12వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 45 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే 50 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చు.
ఇక సినిమా హిందీ లో ఈ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర 1 కోటి నుండి 1.2 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి ఇప్పుడు. ఇక సినిమా మొత్తం మీద 12వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర అటూ ఇటూగా కోటి రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది.
అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే 1.1 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది. సినిమా వర్కింగ్ డేస్ లో మరోసారి అనుకున్నట్లే డ్రాప్స్ ను సొంతం చేసుకుంటూ ఉండగా 12 రోజుల్లో సాధించే అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.