బాక్స్ ఆఫీస్ దగ్గర బాక్ టు బాక్ హాట్రిక్ విజయాలను సొంతం చేసుకున్న తర్వాత డబుల్ హాట్రిక్ కి సిద్ధం అయిన నట సింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) నటించిన లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్(Daaku Maharaaj Movie) సినిమా ఎక్స్ లెంట్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకున్న తర్వాత సంక్రాంతికి వస్తున్నాం సినిమా వలన…
కలెక్షన్స్ లో హెవీ డ్రాప్స్ ను సొంతం చేసుకున్నా తిరిగి వర్కింగ్ డేస్ లో మాస్ సెంటర్స్ లో మంచి హోల్డ్ ని చూపెడుతూ బ్రేక్ ఈవెన్ మార్క్ వైపు ఒక్కో అడుగు ముందుకు వేస్తూ ఉండగా ఓవరాల్ గా 11వ రోజుతో పోల్చితే 12వ రోజున మరోసారి వర్కింగ్ డే లో…
లిమిటెడ్ డ్రాప్స్ ను సొంతం చేసుకుని మంచి హోల్డ్ ని చూపిస్తూ ఉన్న సినిమా ఓవరాల్ గా ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే తెలుగు రాష్ట్రాల్లో 45 లక్షల రేంజ్ కి అటూ ఇటూగా షేర్ ని అందుకునే అవకాశం ఉండగా, ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే సినిమా….
50 లక్షల రేంజ్ షేర్ ని అందుకునే అవకాశం ఉంది. ఇక సినిమా కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ లో పర్వాలేదు అనిపిస్తున్న సినిమా 60 లక్షల రేంజ్ కి అటూ ఇటూగా షేర్ ని అందుకునే అవకాశం ఉండగా….ఫైనల్ లెక్కలు బాగుంటే షేర్ ఓవరాల్ గా…
కొద్ది వరకు పెరిగే అవకాశం ఉందని చెప్పాలి. మొత్తం మీద మరోసారి వర్కింగ్ డేస్ లో మాస్ సెంటర్స్ లో మంచి హోల్డ్ ని చూపెడుతున్న డాకు మహారాజ్ మూవీ వీకెండ్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర గ్రోత్ ని చూపించే అవకాశం ఉంది. ఇక 12 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించే కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.