బాక్స్ ఆఫీస్ దగ్గర మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ గాడ్ ఫాదర్ రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా రెండో వీకెండ్ లో భారీ గ్రోత్ ని చూపించాల్సిన అవసరం ఉన్నా కానీ జస్ట్ ఓకే అనిపించే రేంజ్ లోనే కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ పరుగును కొనసాగిస్తూ ఉండగా సినిమా 12వ రోజు సండే అడ్వాంటేజ్ లభించగా ఉన్నంతలో పర్వాలేదు అనిపిస్తున్నా కానీ ఓ సాలిడ్ గ్రోత్ ఉన్న డే అయితే…
కాదనే చెప్పాలి ఇప్పుడు… సినిమా కొన్ని సెంటర్స్ లో కొంచం డ్రాప్స్ ఉండగా కొన్ని చోట్ల మాత్రం ఆల్ మోస్ట్ 11వ రోజు లెవల్ లోనే హోల్డ్ చేసింది, దాంతో నైట్ షోలలో కూడా ఇదే ట్రెండ్ కొనసాగగా మొత్తం మీద ఇప్పుడు…
సినిమా తెలుగు రాష్ట్రాల్లో అటూ ఇటూగా 50 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ కనుక గ్రోత్ ని చూపిస్తే మొత్తం మీద సినిమా 55 లక్షల నుండి 60 లక్షల దాకా వెళ్ళే అవకాశం…
కొద్ది వరకు ఉంటుంది, ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 75 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా ఫైనల్ లెక్కలు ఈ అంచనాలను భారీగా మించాల్సిన అవసరం అయితే ఉంది, మరి సినిమా టోటల్ 12 డేస్ కి గాను ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.