నాచురల్ స్టార్ నాని(Nani) నటించిన లేటెస్ట్ మూవీ హిట్3(Hit 3 Movie) సినిమా రెండో వీకెండ్ లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని ఓవరాల్ గా సొంతం చేసుకుని మంచి లాభాలను ఓవరాల్ గా దక్కించుకుంటూ పరుగును కొనసాగిస్తూ ఉండగా సినిమా నాని కెరీర్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్ మూవీస్ లో ఒకటిగా దూసుకు పోతూ ఉంది.
ఇక సినిమా వీకెండ్ ని కంప్లీట్ చేసుకుని ఇప్పుడు వర్కింగ్ డేస్ లోకి అడుగు పెట్టగా వర్కింగ్ డే ఇంపాక్ట్ వలన డ్రాప్స్ అయితే గట్టిగానే కనిపిస్తూ ఉండగా… ఉన్నంతలో సినిమా మరోసారి పర్వాలేదు అనిపించేలా ట్రెండ్ ను చూపించే అవకాశం ఉంది.
మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలకు ఎక్కువ డ్రాప్స్ ఉండగా తిరిగి ఈవినింగ్ అండ్ నైట్ షోలకు పర్వాలేదు అనిపించేలా బుకింగ్స్ కనిపిస్తూ ఉండగా, ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కూడా ఇదే విధంగా ఉంటే కనుక సినిమా ఓవరాల్ గా ఇప్పుడు…
12వ రోజున తెలుగు రాష్ట్రాల్లో 30-35 లక్షల రేంజ్ లో షేర్ మార్క్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఆఫ్ లైన్ లెక్కలు కొంచం అంచనాలను మించితే ఈ లెక్క కొంచం పెరగవచ్చు. టికెట్ హైక్స్ ని కూడా నార్మల్ రేట్స్ కి తగ్గించడంతో డీసెంట్ ఫుట్ ఫాల్స్ ను…
సొంతం చేసుకుంటున్న హిట్3 మూవీ ఇక వరల్డ్ వైడ్ గా 45 లక్షల రేంజ్ కి అటూ ఇటూగా షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఆఫ్ లైన్ కౌంటర్ సేల్స్ బాగుంటే షేర్ మరికొంత పెరగవచ్చు. ఇక టోటల్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 12 రోజులకు గాను ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.