బాక్స్ ఆఫీస్ దగ్గర ఆర్ ఆర్ ఆర్ మూవీ రెండో వీక్ వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అవ్వగా 11 వ రోజు కొంచం హెవీగా డ్రాప్ అయిన సినిమా 12వ రోజు పార్షిక హాలిడే అడ్వాంటేజ్ తో ఉన్నంతలో మంచి కలెక్షన్స్ నే బాక్స్ అఫీస్ దగ్గర సొంతం చేసుకుని హోల్డ్ చేసింది. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 13వ రోజు కి వచ్చే సరికి ఫుల్ వర్కింగ్ డే అవ్వడం తో…
ఆ ఇంపాక్ట్ వలన అనుకున్న దానికన్నా కూడా కొంచం ఎక్కువ గానే డ్రాప్స్ ను సొంతం చేసుకుని దెబ్బ పడేలా చేసుకుంది. సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో 13 వ రోజు 3 కోట్ల నుండి 3.2 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉందని అంచనా వేసినా కానీ….
మొత్తం మీద సినిమా 2.54 కోట్ల షేర్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర 13 వ రోజున సొంతం చేసుకుంది. ఇక వరల్డ్ వైడ్ గా 8.5 కోట్ల నుండి 9 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని అంచనా వేసినా కానీ మొత్తం మీద సినిమా 7.45 కోట్ల లోపు కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది…
ఇక మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 13 రోజులు పూర్తీ అయ్యే టైం కి టోటల్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 102.46Cr
👉Ceeded: 47.06Cr
👉UA: 31.93Cr
👉East: 14.54Cr
👉West: 12.12Cr
👉Guntur: 16.88Cr
👉Krishna: 13.50Cr
👉Nellore: 8.41Cr
AP-TG Total:- 246.90CR(371.00CR~ Gross)
👉KA: 39.30Cr
👉Tamilnadu: 35.05Cr
👉Kerala: 9.85Cr
👉Hindi: 99.50Cr
👉ROI: 7.85Cr
👉OS – 90.05Cr
Total WW: 528.50CR(Gross- 952.50CR~)
మొత్తం మీద సినిమాను బాక్స్ ఆఫీస్ దగ్గర 451 కోట్ల రేటుకి అమ్మగా సినిమా 453 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా టోటల్ గా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో సినిమా 75.50 కోట్ల ప్రాఫిట్ ను సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ నుండి సూపర్ హిట్ గా నిలిచింది అని చెప్పాలి ఇప్పుడు. ఇక లాంగ్ రన్ లో ఇంకా ఎంత దూరం సినిమా వెళుతుందో చూడాలి.