Home న్యూస్ 13 ఏళ్ల క్రితం కంప్లీట్ అయిన బ్లాక్ బస్టర్ రీమేక్…ఇప్పుడు రిలీజ్ కానుంది!!

13 ఏళ్ల క్రితం కంప్లీట్ అయిన బ్లాక్ బస్టర్ రీమేక్…ఇప్పుడు రిలీజ్ కానుంది!!

0

చిన్న సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహకందని రికార్డులను క్రియేట్ చేయడం అన్నది చాలా తక్కువ సార్లే జరిగింది, అలా మరీ చిన్న సినిమా కాకున్నా కానీ రిలీజ్ వరకు అసలు పెద్దగా అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యి ఫ్యామిలీ సబ్జెక్ట్ తోనే బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ పాజిటివ్ టాక్ తో వచ్చి ఊహకందని కలెక్షన్స్ ని సొంతం చేసుకుని సెన్సేషన్ ని క్రియేట్ చేసిన సినిమాల్లో బొమ్మరిల్లు సినిమా కూడా ఒకటి.

2006 లో సిద్దార్థ్ అండ్ జెనీలియా ల కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా టాలీవుడ్ లో బిగ్గెస్ట్ ఫ్యామిలీ హిట్స్ లో ఒకటిగా నిలిచిన సినిమా అని చెప్పాలి. సిద్ధార్థ్ కెరీర్ ని ఓ రేంజ్ లో బూస్టప్ ఇచ్చిన ఈ సినిమా జెనీలియా ని ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ గా మార్చేసింది.

ఈ సినిమా తర్వాత ఇతర భాషల్లో కూడా రీమేక్ అవ్వగా తమిళ్ లో జయం రవి రీమేక్ చేయగా జెనీలియా తన రోల్ ని తానె చేసి మళ్ళీ మెప్పించింది, సినిమా అక్కడ కూడా హిట్ అయింది, ఇక బొమ్మరిల్లుని 2007 లోనే హిందీ లో రీమేక్ చేశారు.

భారీ లెవల్ లో లాంచ్ అయిన హర్మన్ భవేజా మరియు జెనీలియా కాంబినేషన్ లో నానా పటేకర్ ప్రకాష్ రాజ్ రోల్ లో బోణీ కపూర్ నిర్మించిన ఈ సినిమా ఆ ఏడాదే రిలీజ్ అవ్వాల్సింది కానీ అనుకోని కారణాల వలన అది కుదరక అప్పటి నుండి రిలీజ్ కి అసలు నోచుకోలేదు ఈ సినిమా. అలాంటి సినిమాను…

13 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఈ నెల 29 న జీ సినిమా లో డైరెక్ట్ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా సినిమా ట్రైలర్ ని కూడా లాంచ్ చేయగా, బొమ్మరిల్లు కి మక్కి మక్కి ఎలాంటి తేడా చేంజెస్ లేకుండా తెరకెక్కించారు అనిపిస్తుంది. ఇక సినిమా హిందీ ఆడియన్స్ ను ఎంతవరకు మెప్పిస్తుందో 29 న తేలనుంది అని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here