Home న్యూస్ 130CR జాతర ఇది….తుక్కు రేగ్గొట్టిన దేవర!

130CR జాతర ఇది….తుక్కు రేగ్గొట్టిన దేవర!

0
JR NTR Devara Part 1 1st Day Gross Collections
JR NTR Devara Part 1 1st Day Gross Collections

బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ ఓపెనింగ్స్ తో మాస్ రచ్చ చేసింది యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ మూవీ దేవర(Devara Part 1 1st Day Collections)….అడ్వాన్స్ బుకింగ్స్ తోనే మాస్ రచ్చ చేసిన దేవర సినిమా మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో, కర్ణాటక మరియు ఓవర్సీస్ లో ఎక్స్ లెంట్ గా మాస్ రాంపెజ్ ను చూపించింది…

మొదటి రోజు నైజాంలోనే ట్రాక్ చేసిన గ్రాస్ లెక్క 20 కోట్ల మార్క్ ని దాటేసి సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. ఇక ఆంధ్ర సీడెడ్ ఏరియాల్లో సినిమా రాంపెజ్ మరో లెవల్ లో ఉండగా స్పెషల్ షోలు, ఎక్స్ ట్రా షోల కలెక్షన్స్ తో కలిపి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ను ఇప్పుడు…

తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజున సినిమా సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక ప్రజెంట్ ట్రెండ్ చూస్తుంటే మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో సినిమా 65-70 కోట్ల రేంజ్ లో గ్రాస్ ఓపెనింగ్స్ ను అందుకునే అవకాశం ఉండగా ఫైనల్ లెక్కలు బాగుంటే…

ఈ అంచనాలను ఇంకా మించి పోయే అవకాశం కూడా సినిమాకి ఎంతైనా ఉంది…ఇక కర్ణాటకాలో సినిమా 10 కోట్లకు పైగానే గ్రాస్ ఓపెనింగ్స్ ను అందుకునే అవకాశం ఉండగా తమిళ్, కేరళలో జస్ట్ ఓకే అనిపించగా ట్రాక్ చేసిన హిందీ సెంటర్స్ లో కూడా పర్వాలేదు అనిపించే రేంజ్ లోనే..

Devara Part 1 Pre Release Business Details!!

బుకింగ్స్ ట్రెండ్ కనిపించగా మొత్తం మీద హిందీ అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద సినిమా 10-12 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ను అందుకునే అవకాశం కనిపిస్తుంది….దాంతో ఇండియాలోనే సినిమా మొదటి రోజు ఇప్పుడు…90 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం…

మించిపోయే అవకాశం కూడా ఉండగా ఓవర్సీస్ లో ప్రీమియర్స్ అండ్ డే లెక్కలు 36-40 కోట్ల మార్క్ ని అందుకునే అవకాశం ఉంది. దాంతో టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా 125-130 కోట్ల నుండి ఆ పైన గ్రాస్ ఓపెనింగ్స్ మొదటి రోజు అందుకునే అవకాశం ఉండగా ఫైనల్ లెక్కలు…

ఈ అంచనాలను కొద్ది వరకు మించి పోయే అవకాశం ఉన్నప్పటికీ అది మొత్తం హిందీ లో టోటల్ గా మొదటి రోజు వచ్చే కలెక్షన్స్ పై డిపెండ్ అయ్యి ఉంటుంది అని చెప్పాలి. ఓవరాల్ గా యంగ్ టైగర్ మాస్ జాతర సృష్టించాడు మొదటి రోజున…ఇక ఫస్ట్ డే అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here